బంజారాహిల్స్‌లో యువతిపై అఘాయిత్యం - MicTv.in - Telugu News
mictv telugu

బంజారాహిల్స్‌లో యువతిపై అఘాయిత్యం

December 3, 2019

ఓ ఘటన గురించి మరిచిపోక ముందే మరో ఘటన పునరావృతం అవుతోంది. తాజాగా హైదరాబాద్‌లో మరో మహిళపై కీచక ఘటన చోటు చేసుకుంది. బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 10లోని స్టార్ హాస్పిటల్ లైన్‌లో ఆర్ట్ డైరెక్టర్ లక్ష్మీ సింధూజాపై సోమవారం అర్థరాత్రి సమయంలో కొంతమంది దుండగులు దాడి చేశారు. ఈ ఘటనపై సదరు బాధితురాలు లక్ష్మీ సింధూజ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని  కొంతమంది వ్యక్తులు తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Banjara Hills.

తాను రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో కొందరు ఆకతాయిలు కారుతో ఢీకొట్టారు. దీంతో సింధూజ కారులో ఉన్నవారిని తనను ఎందుకు ఢీకొట్టారని ప్రశ్నించింది. దీంతో వారు కారు దిగి ఇష్టమొచ్చినట్లుగా బూతులు మాట్లాడారని తెలిపారు. వారు ఉర్దూలో దుర్భాషలాడారని, అసభ్యకరంగా ప్రవర్తించారనీ పేర్కొన్నారు. తన లోదుస్తులను కూడా లాగేయడనికి యత్నించారని ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారిని వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. వారు లక్ష్మీ సింధూజపై కావాలనే దాడికి దిగారా? కారణాలు ఏమై ఉంటాయి? అనే కోణంలో,  సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగానూ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.