Tragedy.. Rare Royal Bengal Tiger died
mictv telugu

విషాదం..అరుదైన రాయల్ బెంగాల్ టైగర్ మృతి

July 12, 2022

 

భారతదేశంలోనే అతిపెద్ద రాయల్ బెంగాల్ టైగర్(25) మృతి చెందిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. పులి కళేబరంపై పుష్పగుచ్చాలు ఉంచి, అధికారులు నివాళులు అర్పించారు. గత ఏడాది ఆగస్టు 23వ తేదీన ఈ పులి పుట్టిన రోజు వేడుకలను అటవీశాఖ అధికారులు అంగరంగ వైభవంగా జరిపారు. తాజాగా పులి మరణించడంతో దాని వివరాలను వెల్లడించారు.

”పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం అలీపుర్‌దువార్ జిల్లాలో ఉన్న అడవిలో వృద్ధాప్యం కారణంగా అరుదైన రాయల్ బెంగాల్ పులి (పేరు రాజా) మృతి చెందింది. 2008వ సంవత్సరంలో సుందర్‌బన్స్‌లోని మాట్లా నదిని దాటుతుండగా, ఈ పులిపై ఓ మొసలి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. దాంతో 2008వ సంవత్సరం నుంచి సౌత్ ఖైర్‌బారి టైగర్ రెస్క్యూ సెంటరులో పులిని ఉంచి, కృత్రిమ అవయవాలతో కొన్నేళ్లపాటు నడిచిపించాం. కానీ, పులి రాజాకు ఎటువంటి అనారోగ్య లక్షణాలు అయితే కనిపించలేదు. మరణానికి వృద్ధాప్య సమస్యలే కారణం” అని చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ దేబాల్ రాయ్ తెలిపారు.

అయితే, 25 సంవత్సరాల 10 నెలల వయస్సులో మరణించిన ఈ రాజా రాయల్ బెంగాల్ టైగర్‌లోనే అతి పెద్దది.పెద్ద పులులు సాధారణంగా 20 ఏళ్లకు మించి జీవించవని, కాని రాయల్ బెంగాల్ పులి 25 ఏళ్లకు పైగా జీవించిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. మరణించిన పులిని కీపర్లు, పశువైద్యులు బాగా చూసుకునే వారని రాయ్ పేర్కొన్నారు.