అప్పుడు 500 రైళ్లు అన్నాడు.. ఇప్పుడు కుట్ర అంటున్నాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

అప్పుడు 500 రైళ్లు అన్నాడు.. ఇప్పుడు కుట్ర అంటున్నాడు..

October 22, 2018

మేడం. ఇక్కడ చూడండి. వచ్చిన వాళ్లు ట్రాక్ మీద నిలబడిన విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఉత్సాహంగా ఉన్నారు.. మీ కోసం 5000 వేల మందికిపైగా రైలు పట్టాలపై నిలబడి చూస్తున్నారు. 500 రైళ్లు వచ్చినా.. వాళ్లు మాత్రం అక్కడ నుంచి కదలరు’ ఇవన్ని అమృత్‌సర్‌లో రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించిన స్థానిక కౌన్సిలర్ కొడుకు మిథూ ఘటనకు ముందు మాట్లాడిన మాటలు. కానీ ఎవరూ ఊహించని విధంగా రైలు ప్రమాదం జరిగి 61మంది మృతి చెందారు.

ఈ ఘటన జరిగిన తర్వాత మిథూ పత్తాలేకుండా పోయాడు. సోమవారం అజ్ఞాత స్థలం నుంచే ఆయన ఓ వీడియో విడుదల చేశారు. అందులో ‘దసరా వేడుకల నిర్వహణకు అన్ని రకాల అనుమతులు తీసుకున్నాం. ప్రమాదం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాం. రైల్వే ట్రాక్ మీద ఉన్న జనాలను లోపలకు రావాల్సిందిగా పదిసార్లు విజ్ఞప్తులు చేశాం. అయినా జనం వినిపించుకోలేదు.  ఇంత విషాదం జరుగుతుందని అస్సలు ఊహించలేదు. రైలు ప్రమాద ఘటన తనను తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది. నేను అమాయకుణ్ణి. నాపై కుట్ర జరిగిందని అనుకుంటున్నాను. చేతులు జోడించి మరీ వేడుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించండి’ అని మిథూ వీడియోలో వేడుకున్నాడు.