రావణదహనంలో నెత్తుటేర్లు.. 100కు పైగా మృతి.. - MicTv.in - Telugu News
mictv telugu

రావణదహనంలో నెత్తుటేర్లు.. 100కు పైగా మృతి..

October 19, 2018

దసరా వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్ పక్కన నిర్వహించిన రావణదహనాన్ని రైలు పట్టాలపై నిల్చుని చూస్తున్న వారిపై నుంచి హవ్‌డా ఎక్స్‌ప్రెస్ రైలు దూసుకెళ్లింది. ఈ ఘటన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో 100మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

దసరా పండుగను పురస్కరించుకుని చౌడా బజార్‌లోని మైదానంలో శుక్రవారం రావణదహన కార్యక్రమం నిర్వహించారు. దీన్ని చూసేందుకు వందలాది మందికి వచ్చారు. రావణ దహనాన్ని చూస్తున్న సమయంలో అతి వేగంగా వచ్చిన రైలు పట్టాలపై ఉన్న వారిని ఢీ కొట్టింది. దీంతో ఆ ప్రాంతంమంతా క్షణాల్లోనే రక్తసిక్తమైంది. శరీర భాగాలు ముక్కలు ముక్కలై పడ్డాయి.  ఈ ఘటనలో గాయాలపాలైన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

అయితే ప్రమాదానికి కారణం పెద్ద ఎత్తున్న బాణాసంచా కాల్చడంతో రైలు వస్తున్న విషయాన్ని గమనించ లేకపోయారు. నిర్వహకుల వైఫల్యంతో వందలాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రైలు వచ్చే సమయంలో ప్రజలను అప్రమత్తం చేయకపోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.