నల్లగొండలో కుప్పకూలిన ట్రైని హెలికాప్టర్.. ఇద్దరు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

నల్లగొండలో కుప్పకూలిన ట్రైని హెలికాప్టర్.. ఇద్దరు మృతి

February 26, 2022

నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం, తుంగతుర్తి సమీపంలోని రామన్నగూడెం తండా వద్ద శనివారం ఓ ట్రైనింగ్ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. శిక్షణ ఇచ్చే ట్రైనీ హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలడంతో దట్టమైన మంటలు వ్యాపించాయి. అంతేకాకుండా ఒక్కసారిగా హెలికాప్టర్ కిందపడటంతో తునాకలైంది. ఈ ప్రమాదంలో మహిళా పైలెట్‌తో సహా ట్రైనింగ్ ఫైలెట్ ఉన్నట్లు సమాచారం.

విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ, వైద్య అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యుత్ స్థంభంపై విమానం కూలడంతో భారీగా మంటలు వ్యాపించాయని స్థానికులు పేర్కొన్నారు.