కదిలో రైల్లో అత్యాచారం.. భద్రత గాలిమాటేనా? - MicTv.in - Telugu News
mictv telugu

కదిలో రైల్లో అత్యాచారం.. భద్రత గాలిమాటేనా?

November 27, 2017

రైల్లో చిరుతిళ్ళు అమ్ముకుంటున్న యువతిలో ఆ మృగాడికి బతుకు పోరాటం కనిపించలేదు. కామం కళ్ళకెక్కిన  కళ్లు ఆమెను కబళించాలనే చూశాయి. ప్రయాణికులు నిద్రపోతున్న సమయాన్ని అదునుగా చూసి ఘాతుకానికి పాల్పడ్డాడు.

బాధితురాలు..  దుర్గ్ భోపాల్ అమర్‌కంటక్ ఎక్స్‌ప్రెస్‌లో పల్లీలు, బఠాణీలు అమ్ముకుంటోంది.  భోపాల్‌కు చెందిన జితూ (25) అనే యువకుడు..  అదను కోసం నక్కలా కాపు గాశాడు. ప్రయాణకులు లేని సమయంలో ఆమెను బలవంతంగా  స్లీపర్ క్లాసులోని టాయిలెట్‌లోకి లాక్కెళ్ళాడు. అక్కడే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ప్రయాణీకులు నిద్రలో వుండటంతో ఆమెనెవరూ కాపాడలేకపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు.. అతణ్ని జీతూగా గుర్తించారు. పరారీలో ఉన్న అతణ్ని పట్టుకోవడానికి గాలిస్తున్నారు.