రైలు అంత దగ్గరికొచ్చిందా?  అయితే ఏంటట..! (వైరల్ వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

 రైలు అంత దగ్గరికొచ్చిందా?  అయితే ఏంటట..! (వైరల్ వీడియో)

October 24, 2018

జనానికి ఆత్రం ఎక్కువైపోతోంది. తొందరగా ఇళ్లకు, ఆఫీసులకు వెళ్లాలనే ఆత్రుతతో నిండు ప్రాణాలను రోడ్లకు, రైలు పట్టాలకు ధారపోస్తున్నారు. కుటుంబాలల్లో తీరని విషాదాన్ని నింపుతున్నారు. 62 మందిని బలిగొన్న అమృత్‌సర్ రైలు ప్రమాదం ఇంకా కళ్లముందు కదులుతూనే ఉంది. కానీ జనం మాత్రం రైళ్లను ఆటబొమ్మల్లా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా క్రాసింగుల వద్ద జనం ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో కళ్లకు కట్టినట్టు చూపుతోందీ వీడియో.