జూన్ 1 నుంచి 200 రైళ్లు.. తెలుగు రాష్ట్రాల గుండా వెళ్లేవి ఇవే - MicTv.in - Telugu News
mictv telugu

జూన్ 1 నుంచి 200 రైళ్లు.. తెలుగు రాష్ట్రాల గుండా వెళ్లేవి ఇవే

May 21, 2020

tarin

కేంద్ర ప్రభుత్వం రైలు ప్రయాణాలకు పచ్చ జెండా ఊపింది. లాక్‌డౌన్ నిబంధనలు సడలిస్తూ.. జూన్ 1 నుంచి వీటిని వివిధ ప్రాంతాల గుండ నడపనున్నారు. దాదాపు 200 రైలు సర్వీసులు ప్రయాణికులను చేరవేయనున్నాయి. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఆన్ లైన్ ద్వారా మాత్రమే టికెట్ తీసుకునే సదుపాయం కల్పించారు. రెళ్లలో అన్ని రెండవ తరగతి బోగీలు ఉన్నప్పటికీ ఆన్‌లైన్ ద్వారా ముందుగానే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. వివిధ ప్రాంతాల నుంచి వెళ్లే రైళ్లు తెలుగు రాష్ట్రాల మీదుగా కూడా వెళ్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్లు ఇవే : 

 1. హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (02703/04)
 2. ముంబై- హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ఎక్స్‌ప్రెస్ (02701/02)
 3. విశాఖపట్టణం- ఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్ (02805/06)
 4. హైదరాబాద్-న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ (02723/24)
 5. హైదరాబాద్-విశాఖపట్టణం గోదావరి ఎక్స్‌ప్రెస్ (02727/28)
 6. గుంటూరు-సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ (07201/02)
 7. తిరుపతి-నిజామాబాద్ రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (02793/94)
 8. దానాపూర్-సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్‌ప్రెస్ (02791/92)
 9.  కోణార్క్ ఎక్స్‌ప్రెస్ 
 10. హౌరా-యశ్వంత్‌పూర్ దురంతో ఎక్స్‌ప్రెస్ (02245/46)
 11. సికింద్రాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ (02285/86)