దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. రాత్రి 7గంటల నుంచి రైళ్ల రాకపోకలను పునరుద్దరిస్తున్నట్లు తెలిపింది. నిరసనకారులు రైల్వే ట్రాక్ ల పైనుంచి వెనుదిరుగుతున్నారు. కాసేపట్లో స్టేషన్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు సన్నద్దమవుతున్నారు. స్టేషన్ క్లియర్ అయిన గంటలోనే రైళ్లు నడిచేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దెబ్బతిన్న సిగ్నలింగ్ వ్యవస్థలో ఇప్పటికే రిపేర్లు మొదలు పెట్టారు.
ఆందోళన ముగిసిన వెంటనే రైళ్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో రాకేష్ తెలిపారు. గంట లోపే ప్రధాన రైళ్ల రాకపోకలు జరిగేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఎమర్జెన్సీ యాక్షన్ మీటింగ్ లో అన్ని చర్యలను సిద్ధం చేసుకున్నామని తెలిపారు. రైళ్ల రాకపోకలకు సంబంధించిన సమాచారం కోసం ప్రయాణికులు హెల్ప్ లైన్ నెంబర్ 040-27786666కు ఫోన్ చేయవచ్చని అధికారులు సూచించారు.