హైదరాబాద్, విజయవాడ మీదుగా నడిచే రైళ్లు ఇవే.. - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్, విజయవాడ మీదుగా నడిచే రైళ్లు ఇవే..

May 11, 2020

Trains run between hyderabad and vijayawada

లాక్ డౌన్ విధించడంతో దేశవ్యాప్తంగా ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయిన సంగతి తెల్సిందే. దాదాపు నెలన్నర తరువాత మంగళవారం నుంచి కొన్ని రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి. ఇప్పటికే వలస కూలీలను తరలించడానికి శ్రామిక్ స్పెషల్ రైళ్లు చెక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మరికొన్ని రైళ్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ రైళ్లలో ప్రయాణించే వారికోసం ఆన్ లైన్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. రైళ్ల వివరాల కోసం ఐసిఆర్టిసి వెబ్ సైట్ ను వీక్షించాల్సి ఉంటుంది. కరోనా లక్షణాలు లేనివారిని మాత్రమే ఈ రైళ్లలో అనుమతిస్తారు. ఈ రైళ్లలో ప్రయాణించాలంటే కేవలం ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే టిక్కెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. టికెట్ కన్‌ఫాం అయిన ప్రయాణీకులను మాత్రమే రైల్వే స్టేషన్‌లోకి అనుమతిస్తారు. టికెట్ కన్‌ఫాం అయిన ప్రయాణీకులు గంట ముందే రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. వారికి థర్మల్ స్క్రీనింగ్, కరోనా టెస్టులు నిర్వహిస్తారు. ప్రయాణికులు తమ ఫోన్‌లో ఆరోగ్య సేతు యాప్‌ తప్పనిసరిగా కలిగివుండాలి. అలాగే ఫోన్ లో బ్లూటూత్, లొకేషన్ తప్పనిసరిగా ఆన్ చేసి ఉంచాలి. ప్రయాణీకులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్లు..

* బెంగళూరు, న్యూఢిల్లీ మధ్య రోజూ తిరిగే రైలు, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్, రాయచూరు, సికింద్రాబాద్, కాజీపేటల మీదుగా ప్రయాణిస్తుంది. బెంగళూరులో రాత్రి 8 గంటలకు, న్యూఢిల్లీలో రాత్రి 8.45 గంటలకు ఈ రైలు బయలుదేరుతుంది.

* సికింద్రాబాద్, న్యూఢిల్లీ మధ్య బుధవారం, తిరుగు ప్రయాణంలో ఆదివారం బయలుదేరే రైలు కాజీపేట మీదుగా ప్రయాణిస్తుంది. సికింద్రాబాద్ లో మధ్యాహ్నం 12.45 గంటలకు, న్యూఢిల్లీలో మధ్యాహ్నం 3.55 గంటలకు రైళ్లు బయలుదేరుతాయి.

* చెన్నై సెంట్రల్, న్యూఢిల్లీ మధ్య శుక్ర, ఆదివారాల్లో, తిరుగు ప్రయాణంలో బుధ, శుక్ర వారాల్లో నడిచే రైలు, విజయవాడ, వరంగల్ మీదుగా ప్రయాణిస్తుంది. న్యూఢిల్లీలో మధ్యాహ్నం 3.55 గంటలకు, చెన్నై సెంట్రల్ లో ఉదయం 6.05 గంటలకు రైళ్లు బయలుదేరుతాయి.