రైళ్లలోనూ వైఫై సదుపాయం..! కేంద్ర మంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

రైళ్లలోనూ వైఫై సదుపాయం..! కేంద్ర మంత్రి

October 23, 2019

కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. ఇండియన్ రైల్వేను అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో రైళ్లలోనూ వైఫై సదుపాయం కల్పిస్తామని తెలిపారు. 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ…’ఇది చాలా క్లిష్టమైన టెక్నాలజీకి సంబంధించిన అంశం. ఇందుకోసం విదేశీ టెక్నాలజీ, పెట్టబుడులు అవసరమవుతాయి. కదులుతోన్న రైళ్లలో వైఫై అందించడానికి టవర్ల ఏర్పాటు, ఇందుకు తగ్గ సామగ్రి అవసరం ఉంటుంది. రైళ్లలో వైఫై తీసుకొస్తే భద్రత పరంగానూ చాలా ప్రయోజనాలు ఉంటాయి. ప్రతి కంపార్ట్ మెంట్‌లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి తద్వారా పోలీస్ స్టేషన్‌లకు లైవ్ ఫీడ్‌ను అందించవచ్చు. వైఫై ద్వారా ఇందుకు కావాల్సిన సిగ్నలింగ్ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. మరో నాలుగున్నరేళ్లలో రైళ్లలో వైఫై సదుపాయం అందిస్తాం. ప్రస్తుతం దేశంలోని 5,150 రైల్వే స్టేషన్లలో వైఫై సేవలు అందుతున్నాయి. త్వరలో ఈ సంఖ్యను 6,500కు పెంచడానికి ప్రయత్నిస్తున్నాం’ అని పీయూష్ గోయల్ తెలిపారు.