ఓ హిజ్రా కథ ? - MicTv.in - Telugu News
mictv telugu

ఓ హిజ్రా కథ ?

July 10, 2017

ఈ హైదరాబాదు నగరంలో ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకు, చివరికి ట్రాన్స్ జెండర్స్, హిజ్రాలకు కూడా రక్షణ లేకుండా పోతోంది ? సికింద్రా బాద్ పెరేడ్ గ్రౌండ్ సాక్షిగా సభ్య సమాజం తల వంచుకునే దారుణం జరిగింది. రాత్రి పూట కాంద్రకు ( వాళ్ళ భాషలో డబ్బులు అడుక్కునే విధానం ) పోయిందట రచన అనబడే ట్రాన్స్ జెండర్. అక్కడున్న ఆర్మీ జవాన్ ఆమెను పట్టుకొని బలాత్కారం చెయ్యజూసాడట. తను ప్రతిఘటించే సరికి అత్యంత పైశాచికండా ఆమెను రక్తం వచ్చేలా, ఒళ్ళంతా నల్లగా కమిలిపోయేలా కర్కషంగా కొట్టాడని ఆరోపిస్తోంది. తప్పించుకోవటంతో ప్రాణాలైనా దక్కాయి లేదంటే వాడు నన్ను చంపేసేవాడని భయం భయంగా పోలీస్టేషన్ కు వెళ్ళి కంప్లైట్ లో పేర్కొంది.

కానీ అక్కడ ఆమె కంప్లైంట్ ను తీస్కోవడానికి పోలీసులు నిరాకరించారట. ఎందుకంటే వాళ్ళ మీద ఆక్షన్ తీస్కోవాలంటే సెంట్రల్ గవర్నమెంటు కల్పించుకోవాలనేది రూలు కాబట్టి ! ? ఒకవేళ నా ప్రాణాలు పొయ్యుంటే మన స్టేట్ గవర్నమెంటు పోలీసులు ‘ పోనీలే మన మిలట్రీ వాడే ఏదో పొరపాటున చేసాడని ’ ఇగ్నోర్ చేసేవాళ్ళా ? ఇలా ఎన్ని ప్రశ్నలు వేసినా తనుకు జరగాల్సిన న్యాయం కోసం ఆ గాయాలు మానేదాక ఎదురు చూడాల్సిందే కదా ? పాపం రచన ఏమీ చెయ్యలేక హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. రక్షణ కల్పించే సైనికులే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం అనేది సభ్య సమాజం సిగ్గుతో తల దించుకోవాల్సిన విషయం అని ఈ విషయం తెల్సినవాళ్ళు అనుకుంటున్నారు ??

 

http://www.thenewsminute.com/article/transgender-woman-allegedly-thrashed-army-men-secunderabad-cops-say-theyre-helpless-64906