Transfer of delhi IAS couple who went for a walk with a dog in stadium
mictv telugu

ఢిల్లీలో కుక్కతో వాకింగ్‌కి వెళ్లిన ఐఏఎస్ జంటపై బదిలీ వేటు

May 27, 2022

Transfer of delhi IAS couple who went for a walk with a dog in stadium

పెంపుడు కుక్కతో వాకింగ్ చేయడం కోసం స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న క్రీడాకారులను బలవంతంగా బయటకు పంపించిన ఐఏఎస్ దంపతులపై కేంద్రం తగిన చర్యలు తీసుకుంది. వీరితో భర్త సంజీవ్ ఖిర్వార్‌ను కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌కు, భార్య రింకూ దుగ్గాని అరుణాచల్ ప్రదేశ్‌కి బదిలీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా, రాత్రి ఏడు గంటలకే స్టేడియాన్ని ఖాళీ చేయించి దంపతులిద్దరూ ట్రాక్‌పై కుక్కతో వాకింగ్ చేస్తున్న ఫోటోలు మీడియాలో రావడం తెలిసిందే.

దీనిపై విమర్శలు రావడంతో కేజ్రీవాల్ రాత్రి పది గంటల వరకు స్టేడియాలు తెరచి ఉంచేలా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఢిల్లీలోని అధికారులు కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఉండడంతో ఘటనపై ఢిల్లీ ప్రధాన కార్యదర్శితో వివరాలు తెప్పించుకుంది. నిజ నిర్ధారణ కావడంతో వారిపై బదిలీ వేటు వేసింది. అయితే ఈ బదిలీపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరినీ చెరో చోట బదిలీ చేశారు బానే ఉంది. మరి కుక్క ఎవరితో వెళ్లాలి? అంటూ ఎద్దేవా చేస్తున్నారు.