Preethi Death Case : వరంగల్ మెడికో ప్రీతి కేసులో తొలి వేటు...!! - MicTv.in - Telugu News
mictv telugu

Preethi Death Case : వరంగల్ మెడికో ప్రీతి కేసులో తొలి వేటు…!!

March 3, 2023

ప్రీతి ఘటన కేసులో తొలి వేటు పడింది. ఈ కేసులో మొదట్నుంచీ కూడా కెఎంసీ అనస్థీషియా HOD నాగార్జున రెడ్డి తీరుపై పలు విమర్శలు వ్యక్తవవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. హెచ్ఓడి నాగార్జున రెడ్డిని భూపాలపల్లికి బదిలీ చేసింది. బది కాదు చేయాల్సింది..సస్పెండ్ చేయాలంటూ ప్రీతి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సీనియర్లు తనను వేధిస్తున్నారంటూ ప్రీతి హెచ్ఓడీకి ఫిర్యాదు చేసినప్పుడు చర్యలు తీసుకొని ఉంటే ఈ దారుణం జరిగేది కాదని ఆరోపిస్తున్నారు. సీనియర్ వేధింపులు తట్టుకోలేక ఎంజీఎంలో ప్రీతి పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని ఐదు రోజుల పాటు మృత్యువుతో మరణించిన సంగతి తెలిసిందే.

కాగా ఈ కేసులో యాంటీ ర్యాగింగ్ కమిటీని నియమించింది కాలేజీ యాజమాన్యం. వేధింపులు,ర్యాగింగ్ వల్లే ప్రీతి సూసైడ్ చేసుకుందని యాంటీ ర్యాగింగ్ కమిటీ నిర్దారించింది. ఈ మేరకు ప్రీతి మరణానికి పరోక్షంగా కారణమైన హెచ్ఓడీ నాగార్జున రెడ్డిపై చర్యలు తీసుకుంది. ఇప్పటికే సీనియర్ సైఫ్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలను రాబట్టే పనిలో ఉన్నారు పోలీసులు. అయినప్పటికీ ఇప్పటివరకు ప్రీతి కేసులో మిస్టరీ వీడలేదు.