transfers of 14 ias officers in Telangana
mictv telugu

తెలంగాణలో 14 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ

November 8, 2022

తెలంగాణ‌లో 14 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం సోమవారం రాత్రి ఉత్త‌ర్వులు జారీచేసింది. అదనపు కలెక్టర్ల స్థాయిలో ప్రభుత్వం ఈ బదిలీలు చేపట్టింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాకు అపూర్వ్‌ చౌహాన్‌ను అడిషన్ కలెక్టర్‌గా నియమించింది. అశ్విని తానాజీ వాంఖడేను వరంగల్‌ అడిషనల్‌ కలెక్టర్‌గా బదిలీ నియమించి, ఇక్కడ పనిచేస్తున్న బీ హరిసింగ్‌ను బదిలీ చేసింది. బీ రాహుల్‌ను మంచిర్యాల అడిషనల్‌ కలెక్టర్‌గా నియమించింది. మయాంకర్‌ మిట్టల్‌ను నారాయణపేట అడిషనల్‌ కలెక్టర్‌గా నియమించగా.. ఇక్కడ పని చేస్తున్న కందూరి చంద్రారెడ్డిని అడ్మినిస్ట్రేటివ్‌ డిపార్ట్‌మెంట్‌లో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించింది.

ఇక‌.. కుష్బూ గుప్తాను నల్గొండకు ట్రాన్స్‌ఫర్‌ చేయగా.. ఇక్కడ పని చేస్తున్న రాహుల్‌ శర్మను వికారాబాద్‌ అడిషన్‌ కలెక్టర్‌గా బదిలీ చేసింది. మంద మకరందును జగిత్యాలకు, బదిలీ చేయగా.. ఇక్కడ పని చేస్తున్న జడల అన్సారీని అడ్మినిస్ట్రేటివ్‌ డిపార్ట్‌మెంట్‌లో రిపోర్ట్‌ చేయాలని చెప్పింది. ప్రఫుల్‌ దేశాయ్‌ని జనగామకు బదిలీ చేయగా.. అబ్దుల్‌ హమీద్‌ను అడ్మినిస్ట్రేటివ్‌ డిపార్ట్‌మెంట్‌లో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించింది. అభిషేక్‌ అగస్త్యను మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాకు బదిలీ చేయగా.. ఇక్కడ పనిచేస్తున్న జాన్‌ శ్యామ్‌సన్‌ను అడ్మినిస్ట్రేటివ్‌ కార్యాలయంలో రిపోర్టు చేయాలని చెప్పింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.