కేరళలో ట్రాన్స్ జెండర్ కు జాబ్…!
ఏ సమాజమైతే ఆడామగా కాదని వెక్కిరించిందో.. అదే సమాజాన్ని ధిక్కరించింది. ముళ్లబాటలో పట్టువదలకుండా పయనించి అనుకున్నది సాధించింది. ఎన్నో టర్నింగ్ లు తీసుకున్న ఆ ట్రాన్స్ జెండర్ కల ఇన్నాళ్లకు నేరవేరింది. కేరళలో మల్టీ నేషనల్ కంపెనీలో తొలి ట్రాన్స్ జెండర్ గా ఉద్యోగం సాధించింది. తనలాంటివాళ్లకు బెటర్ లైఫ్ కావాలంటే ప్రభుత్వ,ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగం ఇవ్వాల్సిందేనంటోంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ..
ఈమె పేరు జరా శిఖా. జీవితమంతా కష్టాలమయం. ఆడామగా కాదని సమాజం ఛీ కొట్టింది. కుటుంబం ఆమెను కాదనుకుంది. అయినా వెనక్కి తగ్గలేదు. లక్ష్యం కోసం పరుగులు పెట్టింది. ట్రాన్స్ జెండర్లు ఉద్యోగాలకు అనర్హులా, తమకెందుకు ఉద్యోగాలు ఇవ్వరని ప్రశ్నించింది. గతేడాది అబుదాబిలో జాబ్ వదిలేసి కేరళ వచ్చింది. ఉద్యోగ ప్రయత్నాల్లో చాలా ఇంటర్వ్యూలు అటెండ్ చేసింది. ట్రాన్స్ జెండర్ అని ఏ సంస్థ ఆమెకు ఉద్యోగం ఇవ్వలేదు. అయినా వెనకడుగు వేయక అలుపెరగక ఇంటర్వ్యూలు అటెండ్ చేసి చివరకు జరా ఓ మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం సాధించింది.
“అబుదాబి నుంచి కేరళ వచ్చాక చాలా ఇంటర్వ్యూలకు వెళ్లాను. ట్రాన్స్ జెండర్ అని ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. చివరకు స్నేహితుడి సహాయంతో ఉద్యోగం సాధించాను. కంపెనీ తనను మహిళగా గుర్తించి ఉద్యోగం ఇవ్వడం సంతోషంగా ఉంది .సహోద్యోగులు కూడా సహకరిస్తున్నారు" అని జరా చెబుతోంది.
ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వ , ప్రైవేట్ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే వీరిని తమిళనాడు సర్కార్ పోలీస్ ఉద్యోగాల్లోకి తీసుకుంది. స్కూల్స్ , మెట్రో రైల్ డిపార్ట్ మెంట్ లో ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగాలు రావడం సంతోషంగా ఉందన్న జరా.. భవిష్యత్ లో తమ కమ్యూనిటీ ప్రధానంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.