Transgender Missing Case filed In SR nagar Hyderabad
mictv telugu

రూమ్‌మేట్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన హిజ్రా.. ఊరెళ్తానని చెప్పి..

August 17, 2022

స్నేహితుల దగ్గర రూ.లక్షల్లో అప్పులు చేసి ట్రాన్స్‌జెండర్ పరారైన సంఘటన హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. బోరబండ సైట్‌-3, బాలాజీ ఎన్‌క్లేవ్‌లో ట్రాన్స్‌జెండర్‌ కల్యాణ్‌(35) మరి కొద్దిమంది సహచరులతో కలిసి ఉంటున్నాడు. ఈనెల 12న తన స్వగ్రామమైన గుంటూరు జిల్లా ఉప్పరపాలేనికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. అక్కడకు రాలేదని సమాచారం రావడంతో అంతటా గాలించిన సహచరులు మంగళవారం ఉదయం ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కల్యాణ్‌ సహచరుడు వశీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.

కల్యాణ్‌ తమ అందరి వద్దా అప్పు రూపేణా రూ.30లక్షల వరకు తీసుకుని పరారయ్యాడని అతని సహచరులు మరికొందరు సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఈ అంశాన్ని విచారించి అవసరమైతే సెక్షన్లు మారుస్తామని ఇన్‌స్పెక్టర్‌ చెప్పారు. సదరు ట్రాన్స్‌జెండర్ పరారయ్యాడా? లేదంటే ఎవరైనా డబ్బు కోసం హత్య చేశారా? అన్న కోణాల్లో దర్యాప్తు చేపడతామన్నారు.