కొత్త ట్రాఫిక్ రూల్స్ ఎఫెక్ట్.. రోడ్డెక్కని వాహనాలు - MicTv.in - Telugu News
mictv telugu

కొత్త ట్రాఫిక్ రూల్స్ ఎఫెక్ట్.. రోడ్డెక్కని వాహనాలు

September 19, 2019

Delhi ...

దేశరాజధాని వాసులను కొత్త రూల్స్ ఇబ్బంది పెడుతున్నాయి. కేంద్రం తెచ్చిన మోటార్ వాహన చట్టం సవరణ బిల్లుతో భారీగా జరిమానా విధిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. రోడ్డెక్కితేనే వాత పడిపోతుండటంతో ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ప్రభుత్వం వెనక్కి తగ్గాలనే డిమాండ్‌తో ట్రాన్స్ పోర్ట్ సంఘాలు ఒక రోజు సమ్మెకు పిలుపునిచ్చారు. గురువారం బంద్ పాటించాలని నిర్ణయించారు.

టాన్స్‌పోర్ట్ సంస్థల బంద్ పిలుపుతో ఆటోలు, క్యాబ్‌లు, ట్రక్కులు, ప్రైవేటు వాహనాలు రోడెక్కలేదు. దీంతో ఎక్కడిక్కడ రవాణ వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. వాహ‌నాలు రాక‌పోవ‌డంతో ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందిప‌డుతున్నారు. ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతంలో స్కూళ్లు, కాలేజీల‌ను కూడా మూసివేశారు. ఉపాధి కోసం వాహనాలు నడుపుతూ ప్రయాణికులను చేరవేసే తమకు భారీ జరిమానాలు విధిస్తే తమ జీవితాలు ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు. కొత్త రూల్స్ మరోసారి సమీక్షింయాలని డిమాండ్ చేస్తున్నారు.