ఎక్కడికంటే అక్కడికి మారే స్టేడియం
మీరు ఫుట్ బాల్ ప్రేమికులా? అయితే ఫిఫా కప్ మొదలవ్వబోతున్నది. దీనికి ఖతర్ వేదిక కానుంది. ఈ ప్రపంచ కప్ కోసం ఎనిమిది స్టేడియాలు రెడీ అయిపోయాయి. అందులో ఒక స్టేడియానికి ప్రత్యేకత ఉంది.
నరాలు తెగే ఉత్కంఠతతో సాగే ప్రపంచకప్ ఫుట్ బాల్ ఆటను చూడడానికి రెడీ అయిపోయారా? మీరేమో కానీ వేదికనిచ్చే ఖతర్ మాత్రం రెడీ అయిపోయింది. అయితే మొదటిసారి ఒక వరల్డ్ కప్ గేమ్ ఎక్కడికంటే అక్కడ మారే వెసులుబాటు ఉన్న స్టేడియంలో జరుగుతున్నది. అవును.. మీరు వింటున్నది నిజం.
ట్రాన్స్పోర్టబుల్ స్టేడియం ఇది. ఈ స్టేడియం పేరు 974. దీనికి ఆ పేరు ఎందుకు పెట్టారంటే.. ఇందులో వాడిన కంటెయినర్లు కూడా 974 కావడమే. రాస్ అబూ.. దోహలో సముద్రం ఒడ్డున దీని నిర్మాణం జరిగింది. ఈ మధ్యే దీని నిర్మాణం పూర్తయింది. ఈ స్టేడియం కోసం షిప్ కంటెయినర్లను వాడారు. ఒకేసారి 40వేల మది కూర్చొని మ్యాచ్ వీక్షించేలా దీని నిర్మాణం జరిగింది. అంతేకాదు.. ఈ ఆర్కిటెక్చర్ కూడా కొత్తగా ఉంటుంది. సహజమైన గాలి లోపలికి వచ్చేలా దీని నిర్మాణం చేశారు. మొత్తం రేకులతో తయారైన ఈ స్టేడియం ఒక్కటే కాదు.. ఇక్కడ కూర్చునే కుర్చీలు, బాత్రూమ్లు, పై కప్పు, మెట్లు కూడా అంతా స్టీల్ కంటెయినర్లతోనే తయారు చేశారు. ఈ స్టేడియంలో నవంబర్ 22న మెక్సికో పోలాండ్తో జరిగే పోరు, 24న పోర్చుగల్ గహనా, 26న ఫ్రాన్స్ డెన్మార్క్, 28న జరిగే బ్రెజిల్ స్విట్జర్లాండ్ మధ్య జరిగే ప్రత్యేక పోరుకు ఈ స్టేడియం వేదిక కానుంది. 2030లో మల్డోనాడోలో జరిగే వరల్డ్ కప్ కోసం ఈ స్టేడియం అక్కడకి తరలిపోతుందట.