వికారాబాద్ జిల్లాలో లంకెబిందెలు.. బంగారం, వెండి..  - MicTv.in - Telugu News
mictv telugu

వికారాబాద్ జిల్లాలో లంకెబిందెలు.. బంగారం, వెండి.. 

June 3, 2020

x bcvgb vb

పూర్వకాలంలో దొంగల భయంతో, అధికారుల భయంతో కొందరు నగలను, నాణేలను బిందెల్లో దాచి పూడ్చిపెట్టేవారు. పూడ్చిన వాళ్లు ఆ విషయం అత్యంత ఆప్తులకు తప్ప ఎవరికీ చెప్పేవారు కాదు. కాలక్రమంలో ఎక్కడ పూడ్చారో తెలియక మరిచిపోవడం, చనిపోవడంతో ఎన్నో గుప్తనిధులు ఇంకా భూమిలోనే ఉండిపోయాయి. పొలం దున్నే సమయాల్లో, ఇంటి నిర్మాణాల్లో అలాంటివి బయటపడుతుంటాయి. 

తాజాగా వికారాబాద్ జిల్లా పరిగిలో మండల్ సుల్తాన్‌పూర్ గ్రామంలో బుల్లి లంకెబిందెలు బయటపడ్డాయి. వాటిలో బంగారు నాణేలు, ఆభరణాలు, వెండి నాణేలు వెలుగు చూశాయి. గ్రామానికి చెందిన సిద్దిఖీ తండ్రి యాకుబ్ అలీ తన పొలంలో మొరం తవ్వుతుండగా అవి బయటపడ్డాయి. విషయం ఆనోటా ఈనోటా రెవిన్యూ, పోలీసుల అధికారులకు తెలిసింది. గ్రామానికి చేరుకుని దర్యాప్తు సాగిస్తున్నారు. దొరికినవి కాస్తా ప్రభుత్వ ఖజనాలోకి వెళ్లిపోనున్నాయి.