పిల్లి పిల్ల అనుకుని పులి పిల్లను ఇంటికి తెచ్చుకున్న బుడ్డిది - MicTv.in - Telugu News
mictv telugu

పిల్లి పిల్ల అనుకుని పులి పిల్లను ఇంటికి తెచ్చుకున్న బుడ్డిది

May 14, 2022

ఆడుకోవడానికొని బయటకు వెళ్లిన ఓ చిన్నారి… తిరిగి ఇంటికి వస్తూ వస్తూ.. పెంచుకోడానికి ఓ జంతువును వెంటతెచ్చింది. అనుకోని ఆ అతిథిని చూసిన పాప కుటుంబసభ్యులు ఒక్కసారిగా హడలిపోయారు. పిల్లి పిల్ల అనుకుని ఆ చిన్నారి దారిలో కనిపించిన ఓ చిరుత పిల్లను తీసుకురావడంతో కంగారు పడ్డారు. అయితే అది పులి కూన కావడం, అంతా ప్రమాదకరం కాకపోవడంతో వాళ్లు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్ర మాలేగావ్లోని మోర్జార్ శివరా ప్రాంతంలో నివసిస్తున్న రావ్సాహేబ్ ఠాక్రే అనే వ్యక్తి ఇంటి దగ్గర జరిగింది.

పాప కుటుంబసభ్యులు ఏ క్షణంలోనైనా ఆ చిరుత కూన కోసం తల్లి రావొచ్చని భావించి, చిరుత పిల్లను వారం రోజుల పాటు తమ వద్దే ఉంచుకున్నారు. రోజుకు 1.5 లీటర్లు చొప్పున పాలు పట్టేవారు. ఈ ఏడు రోజులూ చిరుత పిల్లను చూసి ఠాక్రే కుటుంబసభ్యులు కంగారు పడుతుంటే.. చిన్నారి చిముకల్య మాత్రం ఎంచక్కా ఆ కూనతో ఆడుకుంది. ఎక్కడా తల్లి చిరుత జాడ లేకపోవడం వల్ల ఈ చిరుత పిల్ల గురించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. చిన్నారి నివసిస్తున్న ప్రాంతానికి చేరుకున్న అధికారలు చిరుత పిల్లను స్వాధీనం చేసుకున్నారు.