మొక్కల్లో మొనగాడు...వందల్లో ఒక్కడు..! - MicTv.in - Telugu News
mictv telugu

మొక్కల్లో మొనగాడు…వందల్లో ఒక్కడు..!

July 6, 2017

సేవ్ ఎర్త్..సేవ్ ఎన్విరాన్ మెంట్..గో గ్రీన్ ..స్లోగన్స్. అందరూ ఎప్పుడో అప్పుడు నినదించే ఉంటారు. వినుడు వినుడు ఈ స్లోగన్స్ అనుడు వరకే పరిమితం..అస్సలు ఎక్కవు. పచ్చదనం కోరుకుంటారు. ఆహ్లాదకర వాతావరణంలో గడుపుతారు. కానీ చెట్లు నాటరు..గో గ్రీన్ అంటారు గానీ గ్రీన్ టీ తోనే సరిపెడతారు. వందల్లో ఒక్కడు మాత్రమే చెట్లు నాటేస్తుంటాడు. ఇలాంటోడ్నీ అందరూ మెచ్చుకుంటారు. కానీ ఏడాదోకో మొక్కన్న నాటుదామన్న సోయి ఉండదు.మరెలా పర్యావరణ పరిరక్షణ సాధ్యం..?

మన జీవి రామయ్యలాగే …ఒక పెద్దాయన రోజుకో చెట్టు యాభై ఏళ్లుగా నాటేస్తున్నాడు. ఆయన పేరు ట్రీ సామద్.. చెట్టు పేరునే ఇంటిపేరుగా మారి పోయింది. అంతలా నాటాడు చెట్లు..ఇంతకీ ఈయన ఏం చేస్తాడో తెలుసా..రక్తంతో నడుపుతాడు రిక్షాను. నా రక్తం..నా రిక్షాకు చెట్లు అంటూ వచ్చిన వంద సంపాదనతో పచ్చదనమే శ్వాసగా బతికేస్తున్నాడు. ..ఆరు పదుల వయస్సులోనూ రోజుకో మొక్కనాటుతాడు..నాటిన వాటిని పిల్లలా చూసుకుంటాడు. ఎంతైనా ట్రీ సామద్ గ్రేట్ కదా..మోడీ సార్ కు ఇది తెలిస్తే ..మన రామయ్య లాగే అవార్డు ఇచ్చేవారేమో..ట్రీ సామద్ మన దేశం కాదు కదా..బంగ్లా దేశ్.. అందుకే ఎలాగూ అవార్డు ఇవ్వలేం గానీ…చేసిన పనిని స్ఫూర్తిగా తీసుకుందాం. అవకాశం వచ్చినప్పుడు ఏడాదికి ఒక్క మొక్కైనా నాటుదాం..మార్చిపోవద్దు..