Tremendous increase in temperature in coming period
mictv telugu

ప్రజలకు హెచ్చరిక.. విపరీతంగా పెరగనున్న ఎండలు

August 31, 2022

Tremendous increase in temperature in coming period

ఎండాకాలం వచ్చిందంటే ముందుగా అందరూ భయపడేది ఎండల గురించే. ఈ కాలంలో దేశంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అయితే సీజన్లతో సంబంధం లేకుండా ఈ మధ్య ఎండలు కూడా అన్ సీజన్ అయిపోయాయి. ఇక రానున్న దశాబ్దాలలో ఎండలు మరింత పెరుగుతాయని తాజా సర్వే ఒకటి హెచ్చరించింది. జర్నల్ కమ్యూనికేషన్ ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంట్‌లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి. ఈ నివేదిక ప్రకారం వాతావరణ మార్పులు, కర్బన ఉద్గారాలతో ఏడాదిలో 25 – 50 శాతం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. 2050 నాటికి భారత్ వంటి దేశాల్లో ప్రమాదకరమైన వడగాల్పులు వీచే అవకాశముందని తేల్చి చెప్పింది. వీటి వల్ల దీర్ఘకాలిక వ్యాధులతో పాటు ఎంతోమంది ప్రజల ప్రాణాల మీద ముప్పు తెస్తుందని వెల్లడించింది. వ్యవసాయం వంటి రంగాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని వివరించింది.