Tremors felt across Delhi-NCR region
mictv telugu

ఢిల్లీలో భూ ప్రకంపనలు..భయంతో జనం పరుగులు

January 24, 2023

 

Tremors felt across Delhi-NCR region

దేశ రాజధాని ఢిల్లీని భూ ప్రకంపనలు భయపెడుతున్నాయి. జనవరి నెలలో మూడో సారి భూమి కంపించింది. మంగళవారం మ.2:28 గంటల సమయంలో కొన్ని సెకెన్లు పాటు భూమి కంపించింది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఈ ప్రకంపనలు వెలుగుచూశాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఇంటి నుంచి బయటకు పరగులు తీశారు. భూ ప్రకంపనల ధాటికి ఇంట్లోని పలు వస్తువులు కిండపడిపోయాయి. ఫ్యాన్‌లు, షాండ్లియర్‌లు ఊగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైంది. వరుస ప్రకంపనలతో ఢిల్లీ వాసులు హడలిపోతున్నారు. ఢిల్లీతో పాటు రాజస్థాన్ రాజదాని జైపూర్ లో కూడా ప్రకంకపనలు కలకలం రేపాయి. నేపాల్ వచ్చిన భూకంపం కారణంగానే ఢిల్లీలో ఈ పరిస్థితులు వెలుగుచూశాయని శాస్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని పితోర్‎గఢ్‌కు తూర్పున 148 కిలోమీటర్ల దూరం నేపాల్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.