మైక్ టీవీ మీద మీ ఆదరణ ఏమాత్రం తగ్గలేదని మరోమారు నిరూపించారు. తాజాగా విడుదలైన మైక్ టీవీ బతుకమ్మ పాట 2020కి మీరంతా బ్రహ్మరథం పట్టారు. మీ ప్రేమ, ఆదరణతో మా పాట మీ పాటై ట్రెండింగ్ 4కి చేరుకుంది. మైక్ టీవీ పాట ట్రెండింగ్ వన్‌లోకి వెళ్లగలదు మీ ఆదరణ ఇలాగే కొనసాగితే. వందల్లో బతుకమ్మ పాటలు వస్తున్నాయి. కానీ, మా పాటపై మీరు ప్రత్యేకమైన అభిమానం చూపిస్తారు. మైక్ టీవీ పాట చాలా బాగుంటుంది అని మీరు కామెంట్లలో ఇచ్చే ప్రోత్సాహంతోనే మేము మీకు నచ్చిన పాటలను రూపొందిస్తున్నాం. కనకవ్వ, లక్ష్మీ పాడిన ఈ పాట చాలా బాగుందని మా పాటను ఎత్తుకున్నారు. ప్రతిఏడు మంచి క్వాలిటీతో మీ ముందుకు పాటను తీసుకురావడానికి మా ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రయత్నానికి మీ అపూర్వ ఆదరణకు సదా కృతజ్ఞతలు.