వినాశకాలే విపరీత బుద్ధి అని ఊరికే అనలేదు. ఈ వీడియో అందుకు పర్ఫెక్ట్ ఉదాహరణగా నిలుస్తుంది. లగ్జరీ కారుంటే చాలదు ప్రాణాలకు గ్యారెంటీ లేని రోజులు ఇవి. అయినా కొంత మంది మాత్రం ఏమాత్రం సేఫ్టీ రూల్స్ పాటించకుండా రోడ్లపై వెర్రివేషాలు వేస్తుంటారు. టెక్నాలజీని అడ్డుపెట్టుకుని సోషల్ మీడియాలో తన టెక్కును చూపించాడు ఓ వ్యక్తి. కారులో తన భార్యతో లాంగ్ డ్రైవ్ కి వెళ్లిన వ్యక్తి మార్గమధ్యలో స్టీరింగ్ వదిలేసి మరీ రీల్స్ చేసి నెటిజన్లతో చివాట్లు తింటున్నాడు.
అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అదే తరహాలో మిస్ యూజ్ కూడా జరుగుతోంది. ఈ మధ్యన సోషల్ మీడియా గ్రూప్‌ల వినియోగం పెరగడంతో ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తూ తాము ట్రెండింగ్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు కొంత మంది వినియోగదారులు. తాజాగా ఓ భార్యాభర్తులు చేసిన రీల్ నెట్టింట్లో దుమారం రేపుతోంది. ఎలాంటి సేఫ్టీ తీసుకోకుండా కారు స్టీరింగ్‌ను వదిలి మరీ కపుల్ రీల్ చేశారు. ఎక్కడ, ఎప్పుడు ఈ వీడియో తీశారో తెలియదు. కానీ ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్న ఆ కపుల్స్‌పై నెటిజెన్లు మండి పడుతున్నారు.
అభివృద్ది చెందుతున్న టెక్నాలజీతో సరికొత్త ఫీచర్లతో కార్లు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. అలా అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్, అడాస్ అనే పీచర్ తో అందుబాటులోకి వచ్చిన కార్ మహీంద్రా ఎక్స్ యూవీ 700 కారు. డ్రైవర్ అవసరం లేకుండా, సెన్సార్ల సహాయంతో నడిచే కారు ఇది. అత్యవసర పరిస్థితుల్లో ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి దానంతట అదే బ్రేక్ వేస్తుంది. డ్రైవర్ లైన్ మారకుండా ఒకే పాత్లో దీనిని నడిపించవచ్చు. మరి ఇలాంటి అద్భుతమైన కార్లు మార్కెట్లో చాలానే ఉన్నాయి. అయితే కొంత మంది మాత్రం ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజలకు రాంగ్ మెసేజ్ పంపుతున్నారు.
డబ్బుంది కదా అని లగ్జరీ కారెక్కి ఎలా పడితే అలా బిహేవ్ చేస్తే ఎలా చెప్పండి .అలా చేసిన ఓ ప్రభుద్ధుడిని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. అన్ని సురక్షిత జాగ్రత్తలు తీసుకుని కార్ డ్రైవ్ చేస్తేనే సేఫ్‌గా ఇంటికి వస్తామో లేదో గ్యారెంటీ లేదు. కానీ ఈ వ్యక్తి మాత్రం, లగ్జరీ కారులో తన భార్యతో కూర్చుని స్టీరింగ్ వదిలేసి సరదాగా గొడవ పడుతున్న వీడియోను రీల్‌గా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అక్కడి వరకు ఓకే అనుకున్నప్పడికి ఈ వ్యక్తి శృతిమించిపోయి కాలు మీద కాలు వేసుకుని కెమెరాకు పోజులు ఇచ్చాడు. ఇంత షో ఎందుకురా బాబూ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సేఫ్టీ లేని ఇలాంటి వీడియోస్ అవసరమా అంటూ మరికొంత మంది మండిపడుతున్నారు.
No matter how safe you drive.
If you are on the road at the same time with such idiots, your appointment with the almighty is confirmed.pic.twitter.com/QBvg72crPw
— Roads of Mumbai (@RoadsOfMumbai) March 11, 2023