trending viral video young lady blames biker for accident
mictv telugu

తప్పుచేసింది కాక.. రచ్చకెక్కిన పోరి..వీడియో

March 10, 2023

రోడ్ల మీద ఆక్సిడెంట్లు జరగడం అనేది ఈ రోజుల్లో చాలా కామనైపోయింది. అతి వేగంతో కొన్ని, ట్రాఫిక్ రూల్స్‏ను అతిక్రమించి కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే కొన్ని ప్రమాదాలు మాత్రం చాలా విచిత్రంగా ఉంటాయి. మరికొన్ని వినోదాన్ని అందిస్తాయి. అలాంటి వినోదాన్నే అందిస్తోంది ఓ ఇన్సిడెంట్. సాధారణంగా ఆగివున్న వాహనాలను వచ్చి ఢీకొంటే తప్పు ఎవరిది..?ఆగివున్న వారిదా? లేదా ఢీ కొట్టినవారిదా..? అంటే ఢీ కొట్టినవారిదే అని ఎవరైన చెబుతారు.

కానీ , సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న బైక్‏ను వచ్చి ఓ అమ్మాయి తన స్కూటీతో ఢీకొట్టింది. ఈ విషయంలో అమ్మాయి సారీ చెప్పాల్సింది పోయీ తిట్ల దండకాన్ని మొదలు పెట్టింది. ఈ విడ్డూరాన్ని గమనించిన కొంతమంది కుర్రాళ్ళు వీడియోను తీసి నెట్టింట్లో పోస్ట్ చేశారు. అమ్మాయి తీరును చూసిన నెటిజన్లు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు. కొంతమంది మీమ్స్‏ను చేసి మరీ వీడియోను వైరల్ చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే.. వర్షం పడుతుండటంతో ఓ బైకర్ రోడ్డు పక్కన తన బైక్ ను పార్క్ చేశాడు. అటుగా స్కూటీపై వస్తున్న అమ్మాయి కంట్రోల్ తప్పి బైకర్‏ను ఢీకొట్టింది. తప్పు చేసింది అమ్మాయి అయినా, సారీ చెప్పకుండా గుడ్డివాడివా..? కళ్లు కనిపించడం లేదా..? అని బైకర్‏నే తిట్టడం మొదలు పెట్టింది. ఆ పక్కనే ఉన్న వ్యక్తి మేడమ్ తప్పంతా మీదే అని అనడంతో ఏంటి మీరు నాపై అరుస్తున్నారు అని బదులిచ్చింది. ఈ వీడియో కాస్త నెట్టింట్లో వైరల్‏గా మారింది.

సీన్ అంతా చూస్తూ ఇది స్క్రిప్టెడ్ వీడియో అని అర్థమవుతోంది. అమ్మాయి బైక్ డ్రైవ్ చేసుకుంటూ రావడాన్ని క్లియర్‏గా వీడియో తీయడం చూస్తే ఇదంతా కావాలనే చేశారని స్పష్టంగా తెలుస్తోంది. బిహారీ బ్రో అనే ఇన్‏స్టాగ్రామ్ ఖాతాదారు ఈ వీడియోను పోస్ట్ చేశాడు. కొద్ది గంటల్లోనే వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కోరకంగా స్పందిస్తున్నారు. కొంతమంది వింత వింత కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. మరికొందరు ఇది స్ట్రిప్ట్ వీడియో అయినా చూడటానికి సరదాగా ఉందని కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియోను చేస్తూ ఎవరైనా పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే.