ఈ చిన్నోడిని చంపి తినాలకున్నారు.. ఇప్పుడు నువ్వే మా లీడర్ అంటూ.. - MicTv.in - Telugu News
mictv telugu

ఈ చిన్నోడిని చంపి తినాలకున్నారు.. ఇప్పుడు నువ్వే మా లీడర్ అంటూ..

October 28, 2019

పక్కనే శ్రీహరికోట, బాలాసోర్ వంటి రాకెట్ ప్రయోగ కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లోనే మూఢనమ్మకాల పేరుతో ఘాతుకాలకు పాల్పడుతున్నారు. అలాంటిది మారుమూల ప్రాంతాల్లో, అడవుల్లో, నాగరిక సమాజానికి దూరంగా ఉండే, ఒంటికి బట్ట కట్టుకోవడం కూడా తెలీని గిరిజన తెగల సంగతి చెప్పాల్సిందేమేంది. పశ్చిమ పపువాలోని కోరోవాయ్ తెగ కూడా అంతే. తల్లిదండ్రుల చావుకు కారణమయ్యాడంటూ ఓ ‘దెయ్యం పిల్లాడి’ని తమ ఆచారం ప్రకారం చంపి తినాలనుకున్నారు. కానీ అతడు అనుకోని విధంగా తప్పించుకున్నాడు. 13 ఏళ్లగా వేరే ప్రాంతంలో సురక్షితంగా ఉంటున్నాడు. పెరిగి పెద్దాడయ్యాడు. ఫుట్ బాల్ క్రీడాకారుడయ్యాడు. కానీ తన తెగను సంస్కరించాలని తపన పడుతున్నాడు. తనవారిని, తోబుట్టువులను కలసుకోడానికి మళ్లీ అడవుల్లోకి వెళ్లాడు. మారుతున్న కాలంతోపాటు ఆ గిరిజన తెగ కూడా కొన్ని దురాచారాలను మానుకుంది. అతణ్ని ‘చంపి తినకుండా’ ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది. 

వావా చాంబోంగాయ్ అనే 20 ఏళ్ల యువకుడి కథ ఇది. 2006లో అతనికి ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులు చనిపోయారు. వావాలో దుష్టశక్తి ఉండడం వల్లే వారు చనిపోయారని గిరిజనులు భావించి, అతణ్ని చంపి తినాలనుకున్నారు. అయితే చానల్ సెవెన్ అనే టీవీ చానల్ తరఫున పనిచేస్తున్న కార్నీలియస్ సెంబిరింగ్ అనే గైడ్ ఈ విషయం తెలుసుకుని చాకచక్యంగా వావాను కాపాడాడు. సుమత్రాకు తీసుకెళ్లి పెంచుకున్నాడు. తనవారిని చూడాలన్న కోరికతో వావా ఇటీవల పుపువా అడవులకు వెళ్లాడు. వావాను గుర్తుపట్టిన జనం సాదరంగా ఆహ్వానించారు. పాత సంగతి మర్చిపోయి, తమ తెగకు నాయకత్వం వహించాలని కోరారు. ఇప్పట్లో అది సాధ్యం కాదని, తర్వాత చూస్తానని వావా అన్నాడు. 

ిి