ట్రైబల్ ప్రజల ఆత్మగౌరవ నినాదం ‘ఫోక్ స్టూడియో’ పాటలు(వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

 ట్రైబల్ ప్రజల ఆత్మగౌరవ నినాదం ‘ఫోక్ స్టూడియో’ పాటలు(వీడియో)

February 17, 2020

Folk Studio.

మైక్ టీవీ, 10టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఫోక్ స్టూడియో’ పాటలపోటీ కార్యక్రమం సెమీ ఫైనల్స్ రెండో రౌండులో గాయనీ గాయకులు ఏమాత్రం జోష్ తగ్గకుండా వినసొంపైన పాటలు పాడుతున్నారు. మొదటి ఫోక్ మెలోడీ రౌండ్‌లో అందరూ తమ ఉత్తమ పాటలతో అదరొట్టారు. ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఇప్పుడు రెండో రౌండ్ ‘మేమిచ్చే పాట మీనోట’కు చేరుకున్నారు. ఈ రౌండ్‌లో న్యాయ నిర్ణేతలు, అతిథి పాటకు థీమ్ ఇస్తారు. ఆ థీమ్ స్ఫురించేలా గాయకులు పాట పాడాల్సి ఉంటుంది. ఈ రౌండ్ వారికి కాస్త పరీక్ష పెడుతుంది. కానీ, ఛాలెంజింగ్‌గా తీసుకుని పాట పాడగలిగితే వారు గ్రాండ్ ఫినాలేకు వెళ్తారు. ‘నెత్తిమీద నెమలి పింఛం ఒంటిమీద పులిచర్మం ఆదివాసులం మేము మూలవాసులం’ పాటతో వరంగల్ నుంచి వచ్చిన టైలరన్న చిరంజీవి సరికొత్త పాటతో మీకు ఆదివాసులను పరిచయం చేస్తారు. ఆయన పాడితే అడవిలో ఒక డేరా వేసుకుని తిరిగి పండ్లు తిన్నట్టు అనిపిస్తుంది. అడవిలో పుట్టిన తేనెను మనుషులు తీసుకువచ్చి మార్కెట్ చేస్తున్నారు. అలాగే వీరు కూడా ఊరిలో పుట్టి వారి గొంతును ఈ వేదిక సాక్షిగా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.

మరో గాయకుడు విజయనగరం నుంచి వచ్చిన రఘు ‘ఓరి మామయ్యో ఓరి మామయ్యో.. చీర కట్టుడు నేర్పించరా మామయ్యా’ అంటూ మరదలు బావతో చీరకట్టుడు నేర్పించమని చెప్పే సరదా పాటతో వస్తున్నారు. ‘నువ్వుర్క నేనుర్క రాయే నర్సు తాళ్లల్ల దాక రాయే నర్సు’ అనే పాటతో బైరగోని చంద్రం తన పాటతో మిమ్మల్ని కొత్త ప్రపంచంలోకి పరుగులెత్తిస్తాడు. ‘బొంగురాలు ఆడేటి బౌడల్ల ఎలదరియనాయిరాల ఎలదరియ’ అంటూ ఓ వినూత్నమైన పాటతో నిజామాబాద్ నుంచి వచ్చిన సుంకపాక ధరణి పాడుతున్నారు. ఇలా ఒక్కొక్కరు తమ పాటలతో సమ్మక్క సారక్క, కొమురంభీం, ఆదివాసీలను గుర్తుకు తెస్తారు. ట్రైబల్ ప్రజల ఆత్మగౌరవ నినాదంలా ఉంటాయి వారి పాటలు. సాహిత్యం, సంగీతం, స్వరాలను అన్నింటినీ సముపాళ్లలో రంగరించి పాడుతుంటే మీరు కళ్లు మూసుకుని పాటను ఆస్వాదించకమానరు. ఈ సెమీ ఫైనల్స్‌కు తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ విచ్చేశారు. ఆలస్యం చేయకుండా పూర్తి ఎపిసోడ్‌ను క్రింది లింకులో చూడగలరు.