ఖననానికి డబ్బులు లేక గిరిజన మహిళ శవాన్ని నదిలో పడేశారు - MicTv.in - Telugu News
mictv telugu

ఖననానికి డబ్బులు లేక గిరిజన మహిళ శవాన్ని నదిలో పడేశారు

July 1, 2020

godavari

మనిషి పుట్టుకే కాదు.. చావు కూడా డబ్బుతో ముడిపడి ఉంది. అంత్యక్రియలు చేయడానికి డబ్బులు లేక ఓ గిరిజన మహిళ శవాన్ని నేరుగా నదిలో పడేశారు. మధ్యప్రదేశ్‌లో సిధీ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. ప్రజలకు కనీస వసతులు కూడా ఏర్పాటు చేయలేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. 

నాలుగు రోజుల క్రితం ఓ గిరిజన మహిళ అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను ఎడ్లబండిలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమించడంతో మరణించింది. అంబులెన్స్ ఇవ్వాలని ఆమె బంధువులు వైద్య సిబ్బందిని కోరినా ఇవ్వలేదు. చేసేదేమి లేక తిరిగి ఎడ్ల బండిపై తీసుకువస్తూ.. మధ్యలో సోన్ నదిలో విసిరేశారు. చేతిలో డబ్బులు లేక, ఖననం చేసే మార్గం లేకపోవడంతో అందులో జార విడిచారు. కాగా దహనం చేసేందుకు అక్కడ ప్రభుత్వ పథకం అమలులో ఉంది. ఆ విషయం తెలియని వారు ఇలా చేయడంతో అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. దీంతో వెంటనే జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు.