tricks to make perfect crispy vada, vada, garelu, crispy, tasty, perfect, tricks, tips
mictv telugu

గారెలు క్రిస్పీగా రావాలాంటే….ఈ టిప్ప్ పాటించాల్సిందే

January 16, 2023

ricks to make perfect crispy vada

కనుమ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది మినపగారెలు. అందులోకి కోడి లేదా నాటుకోడి కూర ఉంటే…ఆహా…నా రాజా…ఆ మజానే వేరు. ఏమంటారు. కనుమ అంటే నాటుకోడి పులుసు, మినపగారెలు కాంబినేషన్ ఫేమస్.పండుగ అంటే ఆనందం…ఆనందం అంటే మంచి భోజనం. మామూలు రోజుల్లో మంచి వంటలు వండుకున్నా పండుగకు చేసుకునే పిండివంటల రుచే వేరు. ఇక సంక్రాంతి అంటే చెప్పనే అక్కరలేదు. కనీసం 5 రకాల పిండివంటలైనా చేస్తుంటారు. సకినాలు, కారపూస, లడ్డూలు, అరిసెలు చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాంతాడంతా అవుతుంది. ఇవి స్నాక్స్ టైప్ పిండివంటలు అయితే… పండుగ మూడు రోజులూ పొంగల్, పరమాన్నం, బెల్లం అన్నం, బూరెలు అంటూ దంచికొడతారు.కనుమ రోజు అయితే కచ్చితంగా మినపగారెలు చేయాలంటారు.

కనుమ రోజు కోడిని తమ ఇంటి దేవతకు నైవేద్యంగా పెట్టి.. గారెలు కోడి కూరని చేస్తారు. తమ ఇంటి పెద్దలకు వీటిని ప్రసాదంగా పెడతారు. మాంసం తినని వారికి, మంచి పోషకాలను ఇచ్చేవి మినుములు. అందుకే ‘కనుమ రోజు మినుములు తినాలి’ అనేది వుంది ఈ పండుగ మంచి చలిలో వస్తుంది..అందుకే మినుములు తీసుకోవడం వల్ల వేడి పెరుగుథుందని నమ్మకం.

అయితే గారెలు క్రిస్పీగా వస్తేనే బావుంటుంది. గట్టిగా వస్తే ఎక్కువగా తినలేము అలాగే అవి అరగవు కూడా. మరి గారెలు క్రిస్పీగా రావాలంటే ఏం చేయాలో మీకు తెలుసా. మినపప్పుని తెల్లది కాకుండా పొట్టుది వాడితే అందులో ఫైబర్ ఉంటుంది. ఇది మన శరీరానికి కూడా చాలా మంచిది. గారెలు చూడ్డానికి కలర్ మారుతుందనుకుంటే కాస్తా పసుపు కలపొచ్చు. ఈ పొట్టు మినపప్పు గారెలు తినడానికి కూడా రుచిగా ఉంటాయి. అదే విధంగా మిక్సీ పడుతుంటారు.దీనిని మిక్సీ బదులు రోట్లో రుబ్బితే బాగుంటాయి. రోలు కష్టం అనుకుంటే గ్రైండర్ లో రుబ్బుకోవాలి. సాధ్యమైనంత వరకు గారెల పిండి మిక్సీలో రుబ్బకపోవడమే మంచిది. లేదు ఇంకేమీ లేవు మిక్సీనే గతి అనుకుంటే గారెల పిండి రుబ్బిన తర్వాత కొంచెం సోడా గుండ అందులో కలపండి. గారెలు క్నిస్పీగా వస్తాయి. అయితే మరీ ఎక్కువ కలపకూడదు. సోడాగుండ ఎక్కువ అయితే గారెలు నూనెను పీల్చేస్తాయి.

అలాగే వుత్తి మినపప్పుతో కాకుండా గారెల్లో కొన్ని పదార్ధాలు కలుపుకుంటే రుచి ఇంకా బావుంటుంది. గారెల్లో ఇందులో 4 నుంచి 6 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ అల్లం, 1 కరివేపాకు ఓ రెమ్మ, పావు కప్పు తాజా కొబ్బరి ముక్కలు, మిరియాలు 5, రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటే రుచి అదిరిపోతుంది. ఇవే కాకుండా ఉల్లికాడలు, క్యాబేజీ, క్యారెట్ లాంటివి కూడా తురుముకుని వేసుకుంటే రుచి పెరుగుతుంది.

ఇక గారెలు ఒక లెవల్ అయితే పెరుగు గారెలు ఇంకో లెవెల్. మంచి పెరగులో మినపప్పు, ావాలు, ఎండు మిరప, ఇంగువతో పోపు వేసుకుని గారెలు అందులో వేసుకుని….కొంతసేపు గారెలను అందులో నానబెట్టుకు తింటే భలే టేస్టీగా ఉంటాయి.