Trinamool's Mahua Moitra Shows Off Football Skills On 'Khela Hobe Dibas'
mictv telugu

ఫుట్‌బాల్ ఆడిన మహిళా ఎంపీ.. ఫోటోలు వైరల్

August 18, 2022

చీర క‌ట్టులో ఫుట్‌బాల్ ఆడారు ఓ మహిళా ఎంపీ. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహువా మొయిత్రా చీర కట్టుకొని ఫుట్ బాల్ ఆడుతున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఓ చేత్తో చీర పట్టుకొని కాలితో ఫుట్ బాల్ ఆడుతున్న ఫోటోలను ఎంపీ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఖేలా హోబ్ డిబాస్ కోసం “కికింగ్ ఇట్ ఆఫ్’’ అనే క్యాప్షన్ తో ఫోటోలను షేర్ చేశారు. ఆగస్టు 16వతేదీన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ‘ఖేలా హోబే దివస్’ పాటించాలని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. దీనిలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ మహువా పాల్గొని సందడి చేశారు. ఆమె ఆట తీరుకు నెటిజన్లు కూడా ఫిదా అయ్యారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని యువత ఎక్కువగా క్రీడల్లో పాల్గొనాలని ఆమె పేర్కొన్నారు. అప్పుడే శారీరక, మానసిక ఆరోగ్యం ధృడంగా ఉంటుందని చెప్పారు. ఇక ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా యువత క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. పశ్చిమబెంగాల్లో ఖేలా హోబ్’ (ఆట కొనసాగుతోంది) అనేది గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రధానంగా సాగించిన ఎన్నికల ప్రచార అస్త్రం. బీజేపీతో దీటుగా పోరాటం చేసి, కేంద్రంలోని బీజేపీని ధిక్కరించి , ఓడించి వరుసగా మూడవసారి అధికారంలోకి వచ్చింది. ఇక అప్పటి టీఎంసీ నినాదం ఖేలా హోబే ఇంకా కొనసాగుతుంది.