ట్రిపుల్ తలాక్ చెల్లదు - MicTv.in - Telugu News
mictv telugu

ట్రిపుల్ తలాక్ చెల్లదు

August 22, 2017

సాంప్రదాయం ముసుగులో నష్టపోవాలా ? సామాజిక చైతన్యంతో బాగుపడాలా ? ఈ రెండింటి నడుమ త్రిపుల్ తలాక్ వ్యవహారం నానుతోంది.  ఈ వివాదంపై సుప్రీం కోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధమని తేల్చి చెప్పింది. దీనిపై ఆరు నెలల్లోగా చట్టాన్ని తీసుకురావాలని, అంతవరకు ఈ తలాక్ చెల్లదని స్పష్టం చేసింది.

చట్టం చేసిన తర్వాతే చట్టానికి లోబడి కేసులను విచారిస్తామని కోర్టు పేర్కొంది. అప్పటివరకు ట్రిపుల్ తలాక్ చెల్లుబాటు కాదని చెప్పింది. అంతేకాక ఇప్పటివరకు విచారణలో ఉన్న కేసులను న్యాయస్థానం రిజర్వ్ లో పెట్టింది.ఈ తీర్పును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహార్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం వెల్లడించింది. ట్రిపుల్ రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ను ఉల్లంఘించడం లేదని జస్టిస్ ఖేహార్ అన్నారు. ఈ  సంప్రదాయం 1000 ఏళ్ల కు పైగా ఉందని పేర్కొన్నారు.

 

వాట్సాప్, సోషల్ మీడియా, పోస్టుకార్డు, న్యూస్ పేపర్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పి భార్యలకు విడాకులిస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. దీంతో ట్రిపుల్ తలాక్ న్యాయబద్దం కాదని, దాని వల్ల తమ జీవితాలు నాశనం అవుతున్నాయని మహిళలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. సాంప్రదాయం మాటున మహిళలే నష్టపోవటం గమనార్హమని, సామాజికంగా మహిళలకు సముచిత న్యాయం చెయ్యాలనే దిశలోనే వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఈ ట్రిపుల్ తలాక్ ఉంది. ఈ పద్దతిని తొలగించి చట్టం తీసుకురావాలని పిటిషన్ దారులు కోరారు. అయితే ఈ పిటిషన్లు పై ముస్లిం పర్సనల్ లా బోర్డు మండి పడుతోంది. సుప్రీంకోర్టు మత సంబంధమైన వ్యవహారాలలో జోక్యం సరికాదని చెప్పింది. సుప్రీంకోర్టు దీని పై చాలా సార్లు విచారణ చేపట్టి నేడు తుది తీర్పు వెల్లండించింది.