యోగి సంచలనం.. ట్రిపుల్ తలాక్ బాధితులకు 6 వేలు  - MicTv.in - Telugu News
mictv telugu

యోగి సంచలనం.. ట్రిపుల్ తలాక్ బాధితులకు 6 వేలు 

September 25, 2019

ఉన్నపళంగా మూడుసార్లు తలాక్ అనేసి భార్యను వదిలించుకునే ట్రిపుల్ తలాక్ సంప్రదాయాన్ని రద్దు చేస్తూ కేంద్రం పటిష్ట చట్టం తీసుకొచ్చినా కొన్ని చోట్ల అదింకా సాగుతూనే ఉంది. ఆడపిల్ల పుట్టిందని ఒకరు, అదనపు కట్నం తేలేదని ఒకరు ట్రిపుల్ తలాక్ చెప్పేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో వీరి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్రిపుల్ తలాక్ బాధితులకు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. 

yogi.

బాధితులకు ఏడాదికి రూ.6 వేల సాయం చేస్తామని ఆయన ఈ రోజు ప్రకటించారు. ‘బాధిత మహిళలకు కోర్టులో న్యాయం జరిగేంతవరకు ఈ సాయం చేస్తాం..’ అని చెప్పారు. ఈయన ట్రిపుల్ తలాక్ బాధితుల మహిళలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకున్నారు. యోగి నిర్ణయంపై బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్రిపుల్ తలాక్ కేసుల్లో భర్తలు జైలు కెళ్తే భార్యలను ఎవరు పోషిస్తారన్న ప్రశ్నకు యోగి.. ఈ ఆర్థిక సాయాన్ని పరిష్కారంగా చూపినట్లు తెలుస్తోంది.