ఇదేందయ్యా.. వెనక్కి వెళ్లిపోయిన జలపాతం (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

ఇదేందయ్యా.. వెనక్కి వెళ్లిపోయిన జలపాతం (వీడియో)

August 14, 2020

Trippy 'reverse waterfalls' seen flowing backwards in Australia.

నీరు పల్లం ఎరుగుతుంది అంటారు. ఎటు పల్లం ఉంటే నీరు అటు ప్రవహిస్తుంది. అలా ప్రవహిస్తూనే నదులు, కాలువలు, సముద్రాలు ఏర్పడ్డాయి. అలాగే కొండప్రాంతాల్లో పైనుంచి నీరు ఎప్పుడూ కింద పడుతుంది. దీనిని గురుత్వాకర్షణ శక్తి అంటారన్న విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియాలో మాత్రం నీరు పల్లం ఎరగకుండా.. పైపైకి వస్తోంది. ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ, నమ్మాల్సిందే.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో చూసి ఔరా అనాల్సిందే. దీనిని ఎలాంటి ఆకర్షణ శక్తి అంటారో తెలుసుకోవాల్సిందే. 

ఆస్ట్రేలియాలోని ఆ జలపాతం కిందకు పడకుండా వెనక్కు వెళ్లడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. సిడ్నీ దగ్గరలోని రాయల్ నేషనల్ పార్క్‌ వద్ద ఈ ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ఈ జలపాతం ఇలా వెనక్కు వెళ్లడానికి కుండపోత వాన, ఘోరమైన వాతావరణమే కారణమని వాతావారణ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. సముద్రం నుంచి గంటకు 74 కి.మీ వేగంతో గాలి వీయడం వల్లే ఈ జలపాతం వెనక్కు వెళ్లినట్టు చెప్పారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోయింది. వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా జలపాతం వెనక్కు వెళ్లడం తమ జీవితంలోనే చూడలేదని నెటిజన్లు అంటున్నారు. ఇదేం విచిత్రమో అని మరికొందరు నోళ్లు వెళ్లబెడుతున్నారు.