పెళ్లిళ్లకు టైముంది, పరామర్శకు లేదా.. కేసీఆర్‌పై తృప్తి ఫైర్  - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లిళ్లకు టైముంది, పరామర్శకు లేదా.. కేసీఆర్‌పై తృప్తి ఫైర్ 

December 4, 2019

Tripti desai slams telangana cm kcr 

శబరిమల అయ్యప్ప గుడితోపాటు దేశంలోని అన్ని ఆలయాల్లోకి ఆడవాళ్లను అనుమతించాలని ఉద్యమిస్తున్న భూమాత బ్రిగేడ్ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్ హైదరాబాద్‌లో కలకలం రేపారు. దిశ హత్యాచార ఘటనపై సీఎం కేసీఆర్ సరిగ్గా స్పందించడం లేదంటూ ఈ రోజు ప్రగతి భవన్ ను ముట్టడించారు. పెళ్లిళ్లకు వెళ్తూ ఊళ్లూళ్లూ తిరుగుతున్న సీఎంకు తీరికలేదా అని ప్రశ్నించారు.

దిశను చంపేసిన వారిని కఠినంగా శిక్షించాలని, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని తృప్తి డిమాండ్ చేశారు. అనుచరులతో కలసి ప్రగతి భవన్ వద్దకు చేరుకుని నినాదాలు చేయడంతో ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత పోలీస్ స్టేషన్‌కు తరలించారు.