త్రిపుర ముఖ్యమంత్రి రాజీనామా.. కుమ్ములాట ఎఫెక్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

త్రిపుర ముఖ్యమంత్రి రాజీనామా.. కుమ్ములాట ఎఫెక్ట్

May 14, 2022

ఈశాన్య భారతంలో కాషాయ దళానికి చిక్కొచ్చిపడింది. త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్ ఎస్ఎన్ ఆర్యకు ఇచ్చానని దేబ్ స్వయంగా తెలిపారు. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగునున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

బీజేపీ రాష్ట్ర కమిటీలో అంతర్గత విభేదాలు ముదరడం వల్లే బిప్లబ్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు ఆ రోజు సాయంత్రం సమావేశమై కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు. రాజీనామాకు స్పష్టమైన కారణాలు చెప్పకున్నా తిరిగి బలం నిరూపించుకోవడమో లేకపోతే కొన్ని పట్టువిడుపులతో తన వర్గానికి కీలక పదవులు దక్కించుకోవడమో బిప్లబ్ ఆలోచన అని పార్టీ వర్గాలు భావిస్తున్నారు..