Tripura new cm manik saha biplab deb resign
mictv telugu

త్రిపుర కొత్త సీఎంగా మాణిక్.. రెబల్స్ సంతృప్తి!

May 14, 2022

Tripura new cm manik saha biplab deb resign

త్రిపురలోని బీజేపీ ప్రభుత్వంలో శుక్రవారం అనూహ్య మార్పు జరిగింది. ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ పదవి నుంచి తప్పుకోగానే బీజేపీ ఎంపీ మాణిక్ సాహా సీఎంగా పగ్గాలు అందుకున్నారు. బీజేఎల్పీ భేటీలో ఎమ్మెల్యేలు ఆయనను తమ నేతగా ఎన్నుకున్నారు.

త్రిపుర బీజేపీ అధ్య‌క్షుడిగా ఉన్న మాణిక్ సాహా ప్రస్తుతం రాజ్యసభ ఎంపీ.అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో బిప్లబ్ కుమార్ రాజీనామా చేశారు. వ‌చ్చే ఏడాద అసెంబ్లీకి ఎన్నిక‌లు నిర్వహించనున్న నేపథ్యంలో అసంతృప్తులను బజ్జగించడానికి అధిష్టానం నాయకత్వాన్ని మార్చినట్లు తెలుస్తోంది. మాణిక్ సీఎం కావడంతో అసమ్మతి వాదులు దారికొచ్చి ఎన్నికల్లో మళ్లీ గెలుస్తామని బీజేపీ ధీమాతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.