నాలుగు పదుల వయస్సులో తన అందంతో కట్టిపడేస్తోంది హీరోయిన్ త్రిష. వర్షం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుదోచుకున్న ఈ ముద్దుగుమ్మ రెండు దశాబ్దాల నుంచి హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ మధ్యలో త్రిష ఫుల్ బిజీ అయిపోయింది. త్రిష నటించిన సినిమాలు వరుసగా విడుదులవుతున్నాయి. పొన్నియిన్ సెల్వన్ -1 విజయంతో మంచి ఊపుమీదున్న ఈ అందాల తార మరిన్ని క్రేజీ కాంబినేషన్లకు ఓకే చెప్పేసింది. గతేడాది డిసెంబర్ 30న త్రిష నటించిన తమిళం చిత్రం ‘రాంగి’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్ల కోసం త్రిష ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సమయంలో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు నెటిజన్లకు చిరాకు తెప్పిస్తున్నాయి. దీంతో త్రిషను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ మొదలు పెట్టేశారు.
మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం? అని ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నకు త్రిష బదులిచ్చిస్తూ… ‘నాకు సౌత్ ఇండియన్ హోమ్ ఫుడ్ అంటే ఇష్టం. అందులో బ్రాహ్మణుల ఇంటి భోజనాన్ని బాగా ఇష్టపడుతానని’ సమాధానం ఇచ్చింది. అయితే ఇందులో నచ్చిన ఫుడ్ చెప్పితే బాగుండేది కదా? అందులో కులాన్ని నొక్కి చెప్పడం ఎందుకు అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
ఇష్టాయిష్టాలను తెలియజేయడంలో కులాన్ని తీసుకురావడం అనవసరమంటూ మండిపడుతున్నారు. త్రిష ఫ్యాన్స్ మాత్రం ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. తనకు అనిపించింది చెప్పింది. దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం ఏమాత్రం సరికాదంటూ విమర్శించే వాళ్లకు కౌంటర్ ఇస్తున్నారు. సెలబ్రేటీ అయినంత మాత్రానా ప్రతిదానికి విమర్శలు గుప్పించడం సబబు కాదంటున్నారు.