అడ్డంగా దొరికిన త్రివిక్ర‌మ్.. ఫిల్మ్ తొల‌గింపు - MicTv.in - Telugu News
mictv telugu

అడ్డంగా దొరికిన త్రివిక్ర‌మ్.. ఫిల్మ్ తొల‌గింపు

April 4, 2022

8

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు గతకొన్ని రోజులుగా వాహనాలను భారీగా తనిఖీ చేస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా కార్ల‌కు ఉన్న బ్లాక్ ఫిల్మ్, వాహ‌నాల‌పై పోలీస్, ప్రెస్ స్టిక్క‌ర్లు ఉంటే వాటిని తొల‌గించి, భారీ జ‌రిమానాలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే టాలీవుడ్ స్టార్స్ అయిన అల్లు అర్జున్, జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌, మంచు మనోజ్ వంటి కార్లకున్న బ్లాక్ స్టికర్స్‌ను పోలీసులు తొలగించి, జారిమానాలు విషయం తెలిసిందే.

ఈ సందర్బంగా సోమవారం టాలీవుడ్ మాటల మంత్రికుడు, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కారు పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్ మీదుగా వెళ్తున్న స‌మ‌యంలో పోలీసులు కారును ఆపారు. అనంతరం కారును తనిఖీ చేశారు. కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండడంతో, పోలీసులు దాన్ని తొలగించి, జరిమానా విధించారు. కొన్ని రోజులుగా ట్రాఫిక్ నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డుతోన్న వారిని గుర్తించేందుకు పోలీసులు చేప‌ట్టిన ప్ర‌త్యేక‌ డ్రైవ్‌లో తెలుగు చిత్రసీమకు చెందిన హీరోలు, దర్శకులు పోలీసులకు దొరికిపోవడం సంచలనంగా మారింది. అంతేకాకుండా పోలీసులు కూడా నిబంధనలు పాటించని వాహనాలపై కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు.