Trolling On Allu Arjun Over Satirical Comments On Fan At Urvasivo Rakshasivo Success Meet
mictv telugu

అల్లు అర్జున్ కి ఎందుకంత అహంకారం.. నిన్నటి బన్నీ ఇన్సిడెంట్ పై విమర్శలు

November 7, 2022

మెగా ఫ్యామిలిలో బన్నీపై ఉండే ట్రోలింగ్ ఇంకే హీరోపై ఉండదేమో. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఫ్యాన్స్ లోని ఒక వర్గానికి అల్లు అర్జున్ అంటే గిట్టదని ఇండస్ట్రీలో రూమర్స్ ఉంటాయి. మెగా ఫ్యాన్స్ అండతో హీరో అయ్యి.. ఇప్పుడు ఎదో సొంతగా ఐకాన్ స్టార్ అయినట్టు కలరింగ్ ఇస్తాడని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని అస్సలు బన్నీ కన్సిడర్ చేయడని అంటుంటారు. ఇక మెగా ఫ్యామిలిలో ఇప్పుడు చిరంజీవి తరువాత తనే రియల్ మెగాస్టార్ అని.. తెరవెనుక తన బ్యాచ్ తో సోషల్ మీడియాలో ప్రచారం చేయించుకుంటాడని బన్నీపై విమర్శలు వస్తుంటాయి. దీనికి ఆద్యం పోస్టు చెప్పను బ్రదర్ అని పవన్ ఫ్యాన్స్ తో జగడం పెట్టుకున్నాడు కూడా. అప్పటి నుండి బన్నీని విమర్శించే కొందరు ఫాన్స్ నేటికీ కొన్ని యాంటీ ట్రోల్స్ కొనసాగిస్తూనే ఉన్నారు. అలాంటి వారికి నిన్న జరిగిన ఊర్వశివో రాక్షసీవో సక్సెస్ ఈవెంట్ మంచి కంటెంట్ ఇచ్చినట్లయింది. తన తమ్ముడు అల్లు శిరీష్ తోలి హిట్ గురించి ఎమోషనల్ గా మాట్లాడుతున్న సమయంలో సడెర్న్ గా ఒక అభిమాని వచ్చి కాళ్ళ మీద పడిపోతాడు. ఈ సమయంలో అల్లు అర్జున్ కాస్త అహంకారంతో అభిమానిపై సెటైర్ వేసాడంటూ కామెంట్స్ వస్తున్నాయి.

అయితే స్టార్ హీరోల సినిమా ఈవెంట్స్ లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ని పీఆర్వో లు సెట్ చేస్తారో లేక నిజంగానే అభిమానులు వచ్చేస్తారో కానీ.. హీరోలు మాట్లాడుతుంటే వేదికపైకి వచ్చి కాళ్లపై పడటం కామన్. పవన్, మహేష్, ఎన్టీఆర్, చరణ్ వంటి హీరోల ఈవెంట్స్ లో అభిమానులు ఇలానే వేదికలపైకి వచ్చేస్తే.. వారిని గుండెలకు హత్తుకుని, బౌన్సర్లని తోసేసి ఫొటోలకి పోజులిస్తారు హీరోలు. ఎవ్వరు కూడా అభిమానులని ఒక్క మాట అనరు. కానీ ఇక్కడ బన్నీ కాళ్ళు మొక్కడానికి వచ్చిన ఫ్యాన్ పై సెటైర్ వేస్తాడు. ప్రతి ఈవెంట్ లో ఇలాంటి ఒక వేస్ట్ గాడు ఉంటాడు అని అర్ధం వచ్చేలా టంగ్ స్లిప్ అవుతాడు. బన్నీ మాట్లాడుతుండగానే స్టేజ్ కింద నుంచి ఒక అభిమాని పరుగెత్తుకుంటూ స్టేజ్‌పైకి దూసుకొచ్చాడు. అతడ్ని చూస్తూ… అల్లు అర్జున్ ఎవరు..ఎవరు? అని అడుగుతూ కనిపించాడు. కానీ సదరు అభిమాని అవేమీ పట్టించుకోకుండా నేరుగా వెళ్లి అల్లు అర్జున్ కాళ్లకి మొక్కాడు. ఆ తర్వాత అతని భుజంపై నవ్వుతూ చేయి వేసి అల్లు అర్జున్ ‘ప్రతి పంక్షన్‌లో ఇలాంటోడు ఒకడుంటాడు’ అంటూ సెటైర్ పేల్చాడు బన్నీ. అయితే తనని అభిమానించే ఫ్యాన్ ని కించపరిచేలా సెటైర్ వేయటం తప్పంటూ బన్నీని ట్రోల్ చేస్తున్నారు యాంటీ ఫాన్స్.