థమన్ మరోసారి కాపీ కొట్టాడా ?.. - MicTv.in - Telugu News
mictv telugu

థమన్ మరోసారి కాపీ కొట్టాడా ?..

November 25, 2022

అఖండ హిట్ తర్వాత టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ స్పీడ్ పెంచారు అటు టాక్ షో, ఇటు సినిమాలతో అదరగొడుతున్నారు. అహాలోని అన్ స్టాపబుల్‌తో ఎంటర్ టైన్ చేస్తునే ఇటు వరుసుగా సినిమాలో నటిస్తూ అభిమానులకు డబుల్ ధమాకా అందిస్తున్నాడు బాలయ్య. తాజాగా ఆయన
గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ‘వీరసింహారెడ్డి’ చిత్రంలో నటిస్తున్నారు. దీనిని సంక్రాంతికి విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా థమన్ సంగీతం దర్శకత్వం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ‘‘రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి తీరు.. నిన్ను తలచుకున్నవారు లేచి నించుని మొక్కుతారు” అంటూ వచ్చిన పాట అభిమానులను అలరిస్తుంది. పాట అదిరిపోయింది..మా బాలయ్యకు ఇలాంటి పాటలే కావలంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఎప్పటిలాగే ఈ పాటకు కూడా కాపీ విమర్శలను సంగీత దర్శకుడు థమన్ ఎదుర్కొంటున్నారు. ఓసేయే రాములమ్మ పాట ట్యూన్ కాపీ కొట్టారని సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ మొదలుపెట్టేశారు. అక్కడితో ఆగకుండా ఆ పాటని, ఈ పాటని మిక్స్ చేసి వీడియోలను వదులుతున్నారు. పాటను రాసిన రామజోగయ్య శాస్త్రిని కూడా కొందరు టార్గెట్ చేసారు. అతని పేరు ముందున్న సరస్వతీపుత్ర అనే బిరుదును కూడా అవహేళన చేస్తుండటంతో ఆయన ఫైరయ్యారు అలా ట్రోల్ చేస్తున్న వారందరికీ.. ట్విట్టర్ వేదికగా కౌంటరిచ్చారు.

 

“ప్రతి పాట ప్రాణం పెట్టి మమకారంతో రాస్తాను…దయచేసినన్ను గౌరవంగా చూడగలిగిన వారు మాత్రమే నాతో ప్రయాణించగలరు..
అన్నట్టు…జన్మనిచ్చిన అమ్మగారి గౌరవార్ధం నా పేరును సరస్వతీపుత్ర రామజోగయ్యశాస్త్రి గా మార్చుకున్నాను..ఇందులో ఎవరికీ ఏమి ఇబ్బంది ఉండవలసిన అవసరం లేదు..ఉంటే ఇటు రాకండి.” అంటూ రామజోగయ్య శాస్త్రి ట్వీట్ చేశారు.