డీజే టిల్లు సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ. అంతకు ముందే పలు చిత్రాలు చేసినా డీజే టిల్లుతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు సిద్దు. విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ హీరోల మాదిరి మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. కథకు సంబంధం లేకుండా యాస, భాష, యాటిట్యూడ్, పర్ఫామెన్స్ తో అదరకొట్టేసాడు సిద్దు జొన్నలగడ్డ. ఆ క్రేజ్ ని క్యాచ్ చేసుకోవడానికి డీజే టిల్లుకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమా చేస్తున్నాడు సిద్దు. అయితే ఈ చిత్రం ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ వరుసగా అవాంతరాలు ఎదురవుతున్నాయి. వీటికి అన్నింటికీ సిద్దునే కారణమని అంటున్నారు. మొదట డీజే టిల్లుని తెరకెక్కించిన డైరెక్టర్ విమల్ కృష్ణ ఈ ప్రాజెక్ట్ నుండి పక్కకి తప్పుకున్నాడు. అతను తప్పుకున్నాడా.. తప్పించారా? లేక తప్పుకోవాల్సి వచ్చిందా? అన్నది తెలియదు. ఇక డీజే టిల్లులో రాధికగా నేహా శెట్టిని కూడా నుండి పక్కన పెట్టేసి టిల్లు స్క్వేర్ కి శ్రీలీలను హీరోయిన్గా ప్రకటించారు.
అయితే కారణమేంటో కానీ షూటింగ్ మొదలు కాకముందే శ్రీలీల ఈ చిత్రం నుండి వైదొలిగింది. ఆ తరువాత అనుపమ పరమేశ్వరణ్ని తీసుకున్నారు. ఇప్పుడు ఆమెను కూడా తప్పించేశారు. వీటన్నంటికి సిద్దు బిహేవియరే కారణమని తెలుస్తోంది. సిద్ద యాటిట్యూడ్ వల్లే ఇదంతా జరుగుతోందనే ప్రచారం బయటకు వచ్చింది. కథ, కథనం, డైరెక్షన్, క్యాస్టింగ్ వంటి అన్ని అంశాల్లో సిద్దు జొన్నలగడ్డ తలదూర్చుతున్నాడని విమర్శలు వస్తున్నాయి. అది భరించలేకే హీరోయిన్స్, డైరెక్టర్ సినిమా నుండి తప్పుకున్నారని ఇండస్ట్రీలో రూమర్స్ ఉన్నాయి. ఒక్క హిట్ పడగానే దర్శకుడి పనిలో వేలుపెట్టడం మంచి పద్దతు కాదని అంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం అనుపమ స్థానంలో ప్రేమమ్ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్ ని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఈమెనైనా చివరి వరకు ఉండనిస్తారో లేదో చూడాలి. ఇదంతా చూస్తోన్న నెటిజన్లు.. డీజే టిస్లు సక్సెస్ సిద్దు తలకు ఎక్కిందా? అని కామెంట్లు పెడుతున్నారు. మరి డీజే టిల్లు స్వ్కేర్ ఎలా ఉంటుందో చూడాలి. మళ్లీ మ్యాజిక్ చేస్తుందా? అన్నది చూడాలి.