Trolling On Love Track Between Jabardasth New Anchor Soumya And Hyper Aadi
mictv telugu

మొదటి రోజే పచ్చి బూతు.. జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్యపై విమర్శలు

November 9, 2022

కన్నడ సీరియల్స్ లో సీరియస్ విలన్ గా సుపరిచితమైన నటి సౌమ్య తాజాగా జబర్దస్త్ కి కొత్త యాంకర్ గా ఎంట్రీ ఇచ్చేసింది. గతకొన్నేళ్ళుగా తెలుగువారిని కితకితలు పెడుతున్న ఈ షో నుండి యాంకర్ అనసూయ వెళ్ళిపోవటం, రష్మీ సైతం సైడ్ కాబోతుందన్న వదంతుల నేపథ్యంలో సౌమ్యని రంగంలోకి దించింది జబర్దస్త్ టీమ్. అయితే తెలుగులో మోస్ట్ పాపులర్ షో అయిన ఈ జబర్దస్త్ బూతుకి పెట్టింది పేరని కూడా విమర్శలు ఉన్నాయి. ఫ్యామిలీస్ చూడలేని బూతు పంచులు, లవ్ ట్రాక్స్ ఉంటాయని.. ఒకవర్గం జబర్దస్త్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా.. ఈ షో క్రేజ్ మాత్రం చెక్కుచెదరలేదు. ఇప్పటికి యూట్యూబ్ లో లక్షల్లో వ్యూస్ ఉంటాయి. దీనికి ప్రధాన కారణం జబర్దస్త్ లవ్ ట్రాక్స్. సుధీర్, రష్మిలతో మొదలైన ఈ లవ్ ఎఫైర్స్ రచ్చ.. ఆ తరువాత వర్ష-ఇమ్మాన్యుయేల్, ఆది-అనసూయ, రాకింగ్ రాకేష్, సుజాత వంటి ప్రేమ జంటలతో దూసుకెళ్తుంది. కామెడీతో పాటు ఈ మసాలా యవ్వారాలు జబర్దస్త్ టీఆర్పిలను అమాంతం పెంచేస్తూ వస్తున్నాయి. అయితే ఇంతలో జబర్దస్త్ కి అనుకోని అవాంతరమొచ్చింది.

సుడిగాలి సుధీర్ జబర్దస్త్ ని వీడటం పెద్ద దెబ్బ. దీంతో రష్మీతో సుదీర్ లవ్ ట్రాక్ లేక రేటింగ్స్ కాస్త పడిపోగా.. అనసూయ అవుట్ అవ్వటం జబర్దస్త్ కి మరింత పెద్ద దెబ్బ కొట్టింది. బూతు పంచులకి యాంకర్ అనసూయ ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ కనపడక జబర్దస్త్ స్టేజ్ వెలవెలబోయింది. బహుశా అందుకనేమో కొత్త యాంకరమ్మతో జబర్దస్త్ టీమ్ అప్పుడే బూతు ట్రాక్స్ కి శ్రీకారం చుట్టేసింది. అడల్ట్ పంచులకి ఆధ్యుడైన ఆదిని రంగంలోకి దించేసి.. సౌమ్యపై బూతు జోకులు వేయించేశారు. యాంకర్ సౌమ్య ఎంట్రీ ఇచ్చిన తోలి ఎపిసోడ్ అంతా బూతే అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ‘కలిసిన పరిచయం ఒక రోజే కదా.. కళ్ళతో చూసే నిజం నిజం కాదేమో..’ అంటూ ఆది సౌమ్యలు అప్పుడే జబర్దస్త్ స్టేజిపై డ్యూయెట్ వేసుకుని.. రాబోయే జబర్దస్త్ కి కాబోయే లవ్ బర్డ్స్ అన్న హింట్ ఇచ్చేశారు. సుధీర్ రష్మీలు లేని లోటు ఇక ఆది, సౌమ్యలతో తీర్చనున్నట్టు చెప్పకనే చెప్పేసింది జబర్దస్త్. అయితే యాంకర్ సౌమ్యకి సోషల్ మీడియాలో అప్పుడే పాజిటీవ్ కామెంట్స్ వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా సౌమ్య వాయిస్ వావ్ సూపర్ అంటున్నారు. అందం, కామెడీ టైమింగ్ విషయంలోనూ సౌమ్యకి మంచి మార్కులు పడుతుండటం విశేషం.