Home > Featured > యువతపై నోరుజారిన కేంద్ర మంత్రి.. సోషల్ మీడియాలో ట్రోలింగ్

యువతపై నోరుజారిన కేంద్ర మంత్రి.. సోషల్ మీడియాలో ట్రోలింగ్

కాలుజారితే వెనక్కి తీసుకోవచ్చు కానీ.. నోరు జారితే మాత్రం వెనక్కి తీసుకోలేం. ఇది అందరికీ తెలిసిన సామెతే. అయినా చాలా సార్లు రాజకీయ నాయకులు నోరు జారి చిక్కుల్లో పడుతూనే ఉన్నారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా అటువంటి చిక్కుల్లోనే పడ్డారు.దేశంలో వాహన ఉత్పత్తి రంగం పడిపోవడానికి కారణాలు చెబుతూ యూత్‌పై కామెంట్ చేసి ఇరుక్కుపోయారు. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి.

దేశంలో ప్రస్తుతం ఆటో మొబైల్ రంగం కుదేలైపోయింది. దీంతో చాలా కంపెనీలు ఉత్పత్తులను నిలిపివేస్తున్నాయి. మోదీ ప్రభుత్వం 100 రోజలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సభలో స్పందించిన నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యువత ఎక్కువగా ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ లను ఆశ్రయిస్తూ, కొత్త వాహనాలు కొనేందుకు ముందుకు రావడం లేదంటూ వ్యాఖ్యానించారు. నెలనెలా ఈఎంఐలు కట్టాల్సి వస్తుందని భయపడుతున్న వారు కూడా ఎక్కువగా ఉన్నారని అన్నారు. దీనిపై నెటిజన్లు ట్రోలింగ్స్ ప్రారంభించారు.

ఆమె వ్యాఖ్యలు తప్పుబడుతూ పర్యాటక రంగం అభివృద్ధి చెందకపోవడానికి ఫొటోలు ఆన్‌లైన్లో అందుబాటులో ఉండటమే అని అంటారేమో అంటూ ఒకరు. ‘నిజమే సొంత వాహనం ఉంటే డబ్బు దండగే కదా? డబ్బు మిగుల్చుకోవాలి మరి. ఇదంతా కొత్త వాహన చట్టం ఎఫెక్ట్,యువత ఉద్యోగం చేయడాన్ని ఇష్టపడక పోవడం వల్లే నిరుద్యోగం పెరిగిందంటారేమో’ ఇలా రకరకాల కామెంట్లతో ట్రోలింగ్ చేస్తున్నారు.

Updated : 11 Sep 2019 1:51 AM GMT
Tags:    
Next Story
Share it
Top