Trolls On Megastar Chiranjeevi Waltair Veerayya Title Teaser
mictv telugu

వీరయ్యపై విమర్శలు

October 24, 2022

Trolls On Megastar Chiranjeevi Waltair Veerayya Title Teaser

దీపావళి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రం టైటిల్‌ను ప్రకటించేశారు. ఇప్పటివరకు మెగా 154 పేరుతో తెరకెక్కిన ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ టీజర్ ని సైతం విడుదల చేసింది. చిరంజీవి లుక్స్ ని హైలైట్ చేస్తూ టైటిల్ టీజర్‌ కట్ చేశారు మేకర్స్. చిరంజీవి ఓవర్-ది-టాప్ హీరోయిజంతో టీజర్‌ లోడ్ అయ్యింది. ఒక డెన్ లో హీరోని ఎగతాళి చేస్తూ విలన్ అండ్ బ్యాచ్ మాట్లాడతారు. ‘ఏంట్రా ఆడొస్తో పూనకాలన్నారు. అడుగేస్తే అరాచకం అన్నారు. ఏవడ్రా మీ అన్నయ్య. సౌండే లేదు అని వాల్తేర్ మాస్ బ్యాచ్ అంటే.. ఏకంగా విధ్వంసంతోనే వీరయ్య ఎంట్రీ ఇస్తాడు. విలన్ అండ్ బ్యాచ్ ని పేలుడు పదార్థం పెట్టి బ్లాస్ట్ చేసే ఎపిసోడ్ తో మెగాస్టార్ చిరంజీవి లుక్స్ రివీల్ అవుతుంది.

చిరంజీవి వీరయ్య పాత్రలో లుంగీ కట్టుకుని, బీడీ తాగుతూ,.చెవికి పోగు..మెడలో బంగారు గొలుసులు వేసుకుని ఊర మాస్ లుక్ లో కనిపిస్తాడు. విలన్ బ్యాచ్ ని బ్లాస్ట్ చేసాక.. ‘ఇలాంటి ఎంటర్ టైనింగ్ ధమాకా ఇంకా చూడాలనుకుంటే లైక్..షేర్ సబ్ స్క్రైబ్ చేయండి’ అని అంటాడు చిరంజీవి. ఇక ఈ టీజర్ పై మిశ్రమ స్పందన వస్తుంది. మెగా ఫాన్స్ ఎప్పటిలానే ‘వాల్తేరు వీరయ్య’ని ఆకాశానికి ఎత్తేస్తుంటే.. కామన్ ఆడియన్స్ మాత్రం ‘సో..సో’ ఉంది అంటున్నారు. ఇక కొందరైతే విమర్శలు సైతం గుప్పిస్తున్నారు. ఓటీటీకి అలవాటుపడ్డ ఆడియన్స్ వాల్తేరు వీరయ్యని రెగ్యులర్ కమర్షియల్ మూవీ అంటున్నారు. చిరంజీవి ఫ్లాప్ మూవీ ‘అందరివాడు’తో వాల్తేరు వీరయ్యని పోలుస్తున్నారు. మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంపిక చేసుకోకుండా మళ్ళీ ‘రెండు ఫైట్లు, మూడు పాటల’ సినిమాలు చేయటం ఏంటీ అంటూ కౌంటర్లు ఇస్తున్నారు నెటిజన్స్.