నాగచైతన్య, శోభితాల బంధం అధికారికం కానుందా ? - MicTv.in - Telugu News
mictv telugu

నాగచైతన్య, శోభితాల బంధం అధికారికం కానుందా ?

November 25, 2022

సమంత అంశంతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటాడు నాగచైతన్య. హడావిడి లేని సాదాసీదా లైఫ్ స్టైల్ చైతుది. సోషల్ మీడియాలో అస్సలు కనిపించడు. సౌమ్యుడు, సెన్సిటీవ్ పర్సన్ గా ఇండస్ట్రీలో నాగచైతన్యకి పేరుంది. సమంతకి విడాకులు ఇచ్చినప్పుడు స్పందించిన చైతు ఇప్పటివరకు తెగదింపులపై మళ్ళీ స్పష్టమైన కామెంట్స్ చేయలేదు. సమంత మాత్రం సమయం వచ్చినప్పుడల్లా తన డివోర్స్ పై కొటేషన్స్ పెడుతూనే ఉంటుంది. అయితే తన ప్రమేయం ఉందొ లేదో కానీ తాజాగా మళ్ళీ చైతుపై వ్యక్తిగతంగా ట్రోల్స్ వస్తున్నాయి. యువ హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో నాగచైతన్య రిలేషన్ పై ఎప్పటినుండో పుకార్లు ఉన్నాయి. సమంతతో విడాకులకు ఒక కారణం శోభితా అని, చైతు ఆమెతో డేటింగ్ చేస్తున్నాడని, లివింగ్ రిలేషన్ అని ఏవేవో రూమర్స్ వస్తుంటాయి. ఇందులో ఏది నిజమో కానీ ఒకసారి ఈ ట్రోల్స్ పై మిడిల్ ఫింగర్ చూపెట్టి శోభితా వివాదాస్పదంగా స్పందించింది. దాంతో శోభితా దూకుడుపై నెటిజన్స్ గట్టిగా ఫైర్ అయ్యారు. ఆ తరువాత ఎక్కడ తనపై ట్రోల్స్ రాకుండా జాగ్రత్త పడింది శోభితా.

అయితే చాలారోజులకు మళ్ళీ చైతుతో శోభితా దిగిన ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వటంతో కొత్త చర్చకి దారితీస్తుంది. నవంబర్ 23న నాగచైతన్య బర్త్ డే నుండి ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. దీనిపై నెటిజన్స్ తోచిన విధంగా స్పందిస్తున్నారు. ‘ఏంటీ ఈ ఇద్దరి తమ బంధాన్ని త్వరలో అధికారికం చేసేలా ఉన్నారే’ అని కొందరు అంటుంటే.. ‘కొత్త జంట అద్దిరిపోయింది’ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే వీళ్లు ఈ ఫొటోకి ఫోజు ఇచ్చింది ఎక్కడ? ఎప్పుడు? ఏ సందర్భంలో అనే వాటికి మాత్రం సమాధానాలు తెలియాల్సి ఉంది. ఇక మొన్న నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా తన తాజా చిత్రం ‘కస్టడీ’ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యి అభిమానులని ఆకట్టుకుంటుంది. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ చాలా అద్భతంగా ఉందని, సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోందని, ప్రపంచంలో మార్పు రావాలంటే ముందు నువ్వు మారాలి అనే లైన్ అందరినీ ఆలోజింపచేస్తోందని అంటున్నారు. కస్టడీలో నాగచైతన్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో చైతు అలరించనున్నారు.