భార్య ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బుతో.. ఇంట్లో తిని, కూర్చొని ఎంజాయ్ చేసే భర్తను మనదేశంలో అయితే చాలా చులకనగా చూస్తాం. కానీ ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి మాత్రం.. అతని భార్యలు..ఒకరు కాదు మొత్తం ముగ్గురు చేతినిండా సంపాదిస్తే.. ఇంట్లో కొడుకుని ఆడిస్తూ రోజు గడుపుతాడట. ఓ వ్యక్తికి భార్యగా ఓ అమ్మాయి దొరకడమే కష్టమైన ఈ రోజుల్లో.. ముచ్చటగా ముగ్గురిని చేసుకోవడమే కాకుండా.. వారితో సంతోషంగా.. మరీ ముఖ్యంగా వారి సంపాదనతో దర్జాగా బతుకుతున్న ఈ వ్యక్తిని చూస్తే ఆశ్చర్యపడక తప్పదు.
అమెరికాకు చెందిన నిక్ డెవిస్‌కు.. పదిహేనేళ్ల కిందట ఏప్రిల్ (38) అనే మహిళతో పెళ్లి జరిగింది. ఓ యూనివర్సిటీలో కలిసిన ఆమెతో తొలిచూపులోనే ప్రేమలో పడి వివాహం చేసుకున్నాడు. ఇక తొమ్మిదేళ్ల కిందట ఏప్రిల్ సోదరి జెన్నీఫర్ (34) ను తన మొదటి భార్య అనుమతితో తన జీవితంలోకి ఆహ్వానించాడు. ఆ తర్వాత రీసెంట్ గా డానియేల్ (22)అనే మరో యువతిని.. అక్కాచెల్లెళ్లైన తన ఇద్దరి భార్యల సమక్షంలో మూడవ పెళ్లి చేసుకున్నాడు. ఈ ముగ్గురూ ఒకే ఇంట్లో కలుపుగోలుగా కాపురాలు చేసుకోవడం విశేషం.
తన ముగ్గురు భార్యలు ఉద్యోగాలు చేసి సంపాదిస్తుంటే.. అతడు హాయిగా ఇంట్లో ఉండి రాజభోగాలు అనుభవిస్తున్నాడు. తనను చదరంగం ఆటలో రాజుతో పోల్చుకుంటూ.. ‘‘రాజు ఎక్కడైనా కష్టపడతాడా’’ అని ప్రశ్నిస్తున్నాడు. ‘‘నా కల నిజమైంది. ఇది నా అదృష్టం’’ అని మురిసిపోతున్నాడు. “ముగ్గురు భార్యలను కలిగి ఉండటం, వారందరూ ఒకే దగ్గర ఉండాలని కోరుకున్నాను… నమ్మశక్యం కాని నా కల నిజమైంది’’ అని అంటున్నాడు. వీరికి ఓ కుమారుడు ఉండగా.. గతేడాది జూన్‌లో మరో చిన్నారి పుట్టింది. ముగ్గురు భార్యలతో కలిసి ఉండటం అంటే నిక్‌కు చాలా ఇష్టమని జెన్నీఫర్ చెబుతోంది.