ఉద్రిక్తంగా రాజ్ భవన్ ముట్టడి.. బస్సు అద్దాలు ధ్వంసం - MicTv.in - Telugu News
mictv telugu

ఉద్రిక్తంగా రాజ్ భవన్ ముట్టడి.. బస్సు అద్దాలు ధ్వంసం

June 16, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేడు రాజ్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ పిలుపులో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలపై ఈడీ విచారణ చేపట్టడాన్ని నిరసిస్తూ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, గీతా రెడ్డి, భట్టి విక్రమార్క, బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, మహేశకుమార్ తదితర నాయకులు రాజ్ భవన్ వైపు వెళ్తుతుండగా కార్యకర్తలు ఒక్కసారిగా ఆందోళనలు తీవ్రం చేయడంతో ఉద్రిక్తంగా మారింది.

ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు వివిధ మార్గాల్లో పెద్ద ఎత్తున రాజ్ భవన్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఖైరతాబాద్ కూడలి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఓ ద్విచక్ర వాహనాన్ని ఆందోళనకారులు తగులబెట్టారు. అనంతరం ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. బస్సు పైకి ఎక్కి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసు అధికారులు రాజభవన్ మార్గంలోకి కార్యకర్తలు వెళ్లకుండా ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు

మరోపక్క టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, గీతా రెడ్డి, భట్టి విక్రమార్క, బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, మహేశకుమార్ తదితర నాయకులు రాజ్ భవన్ వైపు వెళ్తుండగా, రేవంత్ రెడ్డి, జుగ్గా రెడ్డి, భట్టి విక్రమార్కులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవంత్ రెడ్డిని స్టేషన్‌కు తరలిస్తుండగా కార్యకర్తలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో కొందరు కార్యకర్తలు సామ్మసిల్లిపడిపోయారు. రాజభవన్లోకి చొచ్చుకెళ్లేందుకు కాంగ్రెస్ నాయకులు యత్నించడంతో పోలీసులు వారిపై లారీఛార్జ్ చేశారు.