TRS activist who obstructed Assam CM's speech
mictv telugu

అసోం సీఎం ప్రసంగాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్త

September 9, 2022

గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా హైదరాబాద్‌లోని ఎంజే మార్కెట్ వ‌ద్ద ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. భాగ్య‌న‌గ‌ర్ గ‌ణేశ్ ఉత్స‌వ క‌మిటీ ఆహ్వానం మేర‌కు గ‌ణేశ్ నిమజ్జ‌నంలో పాలుపంచుకునేందుకు బీజేపీ నేత‌, అసోం సీఎం హిమంత బిశ్వ శ‌ర్మకు చేదు అనుభవం ఎదురైంది. హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా శుక్ర‌వారం ఉద‌యం చార్మినార్ ప్రాంతంలోని భాగ్య‌ల‌క్ష్మి అమ్మ‌వారి ఆల‌యాన్ని సంద‌ర్శించిన హిమంత బిశ్వ శ‌ర్మ‌.. ఆ త‌ర్వాత మొజాం జాహీ మార్కెట్ వ‌ద్ద‌కు వ‌చ్చారు. మార్కెట్ వ‌ద్ద ఏర్పాటు చేసిన వేదిక ఎక్కిన శ‌ర్మ‌… త‌న ప్ర‌సంగాన్ని మొద‌లుపెట్టారు.

ప్రసంగంలో టీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆ స‌మ‌యంలో టీఆర్ఎస్‌కు చెందిన నందుబిలాల్‌ అనే కార్య‌కర్త శర్మను అడ్డుకునేందుకు య‌త్నించాడు. శ‌ర్మ వెనుక నుంచి చొచ్చుకు వ‌చ్చిన నందుబిలాల్‌.. శ‌ర్మ ముందున్న మైక్‌ను త‌న చేతిలోకి తీసుకుని శ‌ర్మ‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘ‌ట‌న‌తో ఒక్క‌సారిగా అప్ర‌మ‌త్త‌మైన గ‌ణేశ్ ఉత్స‌వ క‌మిటీ స‌భ్యుల‌తో పాటు పోలీసులు నందుబిలాల్‌ను అక్క‌డి నుంచి కింద‌కు దించి త‌ర‌లించారు. ఆ త‌ర్వాత శ‌ర్మ త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగించి అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. దీనిపై హుజురాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ నేతలకు సంస్కారం లేదంటూ మండిపడ్డారు.